AP Police : న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన వైజాగ్ పోలీసులు.. అతిక్ర‌మిస్తే క‌ఠిన‌చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌

నూతన సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వేడుక‌ల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విశాఖ పోలీసు

  • Written By:
  • Publish Date - December 29, 2023 / 09:06 AM IST

నూతన సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వేడుక‌ల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విశాఖ పోలీసు కమిషనర్ విడుద‌ల చేశారు. డిసెంబర్ 31, 2023 రాత్రి వేడుకలను నిర్వహించే హోటళ్లు, క్లబ్‌లు, పబ్బులు మరియు ఇతర సంస్థల కోసం కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. అర్థ‌రాత్రి ఒంటి గంట త‌రువాత ఈవెంట్‌లు నిర్వ‌హించే సంస్థ‌లు త‌ప్ప‌నిస‌రిగా ముంద‌స్తు అనుమ‌తి తీసుకోవాల‌ని పేర్కోన్నారు. భద్ర‌తా విష‌యంలో ఈవెంట్ నిర్వాహ‌కులు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని తెలిపారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్‌లు.. పార్కింగ్ ప్రాంతాల్లో త‌ప్ప‌నిస‌రిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. ఈవెంట్‌కు హాజరైనవారి మొత్తం భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం నిర్వాహకులు తగిన భద్రతా సిబ్బందిని తప్పనిసరిగా నియమించాలి. అశ్లీలత లేదా నగ్నత్వం లాంటి డ్యాన్స్‌ల‌ను నిషేధించిన‌ట్లు తెలిపారు. ధ్వని స్థాయిలు తప్పనిసరిగా 45 డెసిబెల్స్‌లో లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఈవెంట్ ప్రాంగణంలో తుపాకీలను, ఇత‌ర నిషేధిత వ‌స్తువుల‌ను తీసుకురావోద్ద‌ని తెలిపారు. పాస్‌లు / టిక్కెట్‌ల జారీ చేసేట‌ప్పుడు వేదిక సామ‌ర్థ్యం ఉన్న వ‌ర‌కు మాత్ర‌మే ఇవ్వాల‌ని తెలిపారు. . ఈవెంట్ ప్రాంతంలో, చుట్టుపక్కల డ్రగ్స్, నార్కోటిక్ పదార్థాల వాడకం, అమ్మకాలు జ‌ర‌గ‌కూడ‌ద‌ని తెలిపింది. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అనుమతించిన గంటలలోపు మద్యం అందించాలి. మద్యం మత్తులో ఉన్న కస్టమర్‌లు సురక్షితంగా తమ ఇంటికి చేరుకునేలా డ్రైవర్లు/క్యాబ్‌లను సంస్థలు అందించాలి.

Also Read:  TDP : “ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా ” అన్న తాడిపత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి : వ‌ర్ల రామ‌య్య‌