Saipriya Missing Case: సాయిప్రియ కథ సుఖాంతమేనా?!

విశాఖ వివాహిత మిస్సింగ్ అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Saipriya

Saipriya

విశాఖ వివాహిత మిస్సింగ్ అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు పోలీసులు సాయిప్రియ, ఆమె ప్రేమికుడు రవిని బెంగళూరు నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. ఇద్దరూ వైజాగ్‌లో దిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో తన బంధువులపై ఫిర్యాదు చేసింది. సాయిప్రియ, ఆమె భర్త శ్రీనివాస్‌లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే సాయిప్రియ మేజర్ కావడంతో ఆమె నిర్ణయం కీలకంగా మారనుంది. ఇదిలా ఉండగా పెళ్లి రోజున శ్రీనివాస్‌ తనకు కానుకగా ఇచ్చిన రెండు బంగారు గాజులను అమ్మేసింది. బెంగుళూరులో తన ప్రేమికుడితో కలిసి రెండు రోజులు ఉండేందుకు ఆమె డబ్బును ఉపయోగించినట్లు సమాచారం.

సాయిప్రియ తన భర్తను బాధపెట్టి తల్లిదండ్రులను, బంధువులను ఇబ్బందులకు గురిచేసినందుకు ఎలాంటి అపరాధ భావం లేదా పశ్చాత్తాపం చూపలేదని పోలీసులు పేర్కొన్నారు. సాయిప్రియ మిస్సింగ్ విషయమై సాయిప్రియ అచూకీ కోసం ప్రభుత్వ అధికారులు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రవి నుంచి తనను విడదీయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని సాయిప్రియ వాయిస్ మెసేజ్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసిన విషయం తెలిసిందే.

  Last Updated: 30 Jul 2022, 01:21 PM IST