విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో ఏర్పటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge ) రెండోసారి తెగిపోయింది. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి గత ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ప్రారంభించిన మరుసటి రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం తో ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఫై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అధికారులు దీనిని ఖండించారు.
మాక్ డ్రిల్‌లో భాగంగా దానిని తామే దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామంటూ ఓ వీడియో విడుదల చేశారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆరోపించారు. ఆ తర్వాత 24 గంటల్లో పర్యాటకులను అనుమతిస్తామని చెప్పారు కానీ అధికారులు ఇప్పటివరకూ దానిని అందుబాటులోకి తేలేదు. ఇక శనివారం ఉదయం ‘టి-జంక్షన్ వ్యూ పాయింట్’ బ్రిడ్జి నుంచి విడిపోయి దూరంగా కొట్టుకుపోయింది. దానిని పట్టుకోవాలని యత్నించిన లైఫ్‌గార్డ్ సముద్రంలో పడిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
సందర్శకులకు ఇంకా అందుబాటులోకి తేనప్పటికి ప్రయోగ సమయంలోనే రెండోసారి ఇలా జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ అలల తాకిడికి ఈ రకంగా జరుగుతుందని, దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదన్నది అధికారులు చెపుతున్నప్పటికీ సందర్శకులు మాత్రం వామ్మో అంటూ దూరం నుండి చూసి వెళ్లిపోతున్నారు. దాదాపు కొటిన్నరకు పైగా వెచ్చించి పర్యాటక అకర్షణగా ఏర్పాటు చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పూర్తిస్థాయిలో రెడీ అయ్యాకే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు నిపుణులను తీసుకువచ్చి లోపాలు జరగకుండా ఎలా నిర్వహించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
Read Also : Snakes: పాములు ఇలా కనిపిస్తే చాలు.. అదృష్టం పట్టి పీడించడం ఖాయం?
