3 capitals: విశాఖ రాజ‌ధానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్

మూడు రాజ‌ధానుల‌పై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రికొత్త స్కెచ్ కు తెర‌లేపారు. ఆయ‌న సూచ‌న మేర‌కు విశాఖ కార్పొరేష‌న్ పరిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ను చేయాల‌ని తీర్మానం చేసింది. ఇదే త‌ర‌హాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, పంచాయ‌తీల్లో తీర్మానాలు చేయ‌డానికి వైసీపీ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. ఆ ప్రక్రియ‌కు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయ‌డం గ‌మ‌నార్హం.

  • Written By:
  • Publish Date - November 5, 2022 / 05:22 PM IST

మూడు రాజ‌ధానుల‌పై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రికొత్త స్కెచ్ కు తెర‌లేపారు. ఆయ‌న సూచ‌న మేర‌కు విశాఖ కార్పొరేష‌న్ పరిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ను చేయాల‌ని తీర్మానం చేసింది. ఇదే త‌ర‌హాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, పంచాయ‌తీల్లో తీర్మానాలు చేయ‌డానికి వైసీపీ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. ఆ ప్రక్రియ‌కు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయ‌డం గ‌మ‌నార్హం.

అధికార వికేంద్రీక‌ర‌ణ, మూడు రాజ‌ధానుల బిల్లును అసెంబ్లీలో ఉప‌సంహ‌రించుకున్నారు. ఆ మేర‌కు రాష్ట్ర హైకోర్టుకు జ‌గ‌న్ స‌ర్కార్ నివేదించిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ప్ర‌భుత్వం రాజ‌ధాని ప్రాంతంలో చేయాల్సిన ప‌నుల‌కు డెడ్ లైన్ కూడా విధించింది. కానీ, హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్ తో ఇంప్లీడ్ అవుతూ అమ‌రావ‌తి రైతులు కూడా పిటిష‌న్ వేశారు. వాట‌న్నింటిపైన ఈనెల 14వ తేదీన విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సుప్రీం కోర్టు రెండుసార్లు విచార‌ణ‌ను ప‌క్క‌కు నెట్టింది. ఈసారి విచారణ ఉంటుంద‌ని భావిస్తున్నారు.

సుప్రీం కోర్టు విచార‌ణ ప్రారంభించ‌కుండానే రాష్ట్రంలోని స్థానిక సంస్థ‌ల నుంచి మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా తీర్మానాలు చేయించ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ స‌రికొత్త ఎత్తుగ‌డ‌గా ఉంది. విశాఖ కార్పొరేష‌న్లో తెలుగుదేశం సభ్యులే కాకుండా, జనసేన, `ఇతర పార్టీల వారు అధికార వికేంద్రీకరణ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆసక్తికరంగా, బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ప్రశంసించారు. వికేంద్రీకరణ ప్రాముఖ్యతను కొనియాడారు.

మొత్తం మీద జ‌గ‌న్మోహన్ రెడ్డి అనుకుంటోన్న మూడు రాజ‌ధానులను సాకారం చేయ‌డానికి స్థానిక సంస్థ‌ల తీర్మానాల‌ను సుప్రీం కోర్టుకు అందించేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎంత వ‌ర‌కు ఆయ‌న స్కెచ్ ఫ‌లిస్తుందో చూడాలి.