Vizag : రైల్వే భూమి విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అబద్దం చెప్పాడు – విశాఖ కలెక్టర్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) ప్రకటించారు. కాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కోసం (Vizag Railway […]

Published By: HashtagU Telugu Desk
Vizag Zone

Vizag Zone

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) ప్రకటించారు.

కాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కోసం (Vizag Railway Zone) 53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదని .. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధం అయ్యిందన్నారు. ఈ వ్యాఖ్యలపై విశాఖ కలెక్టర్ స్పందించారు. విశాఖకు రైల్వే జోన్ కు ఇవ్వాల్సిన స్థలంపై గత డిసెంబర్ లో చీఫ్ సెక్రటరీ రివ్యూ నిర్వహించారని తెలిపారు. అంతకు ముందు ఉన్న వివాదాలను తొలగించి ల్యాండ్ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ల్యాండ్ తీసుకోవడానికి అధికారిని పంపాలని రైల్వేని కూడా కోరామన్నారు. అయితే వారే రాలేదన్నారు. ఎవరైనా వస్తారన్న సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే దీనిపై టీడీపీ , వైసీపీ సోషల్ మీడియా లో వార్ మొదలుపెట్టారు. సిగ్గు పడాలి జగన్మోహన్ రెడ్డి గారు…కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారు….? అంటూ గంటా ప్రశ్నకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి విశాఖలో 52 ఎకరాలు ఇచ్చేలా జీవీఎంసీ, రైల్వే మధ్య 2013లో ఒప్పందం కుదిరిందని వైసీపీ తెలిపింది. ఆతరువాత 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉంది. మరి అప్పుడు మీ టీడీపీ సర్కారు ఈ భూములను ఎందుకు రైల్వేకు అప్పగించలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించింది. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భూమికి సంబంధించిన చిక్కుముళ్లు విప్పేసి 2024 జనవరి 2న ఆ స్థలాన్ని రైల్వేకు అప్పగించిందని తెలిపింది.

Read Also : Autonomous Robot : నేను పెట్టుబడి పెడతా..! మీరు సిద్ధమా..? అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్

  Last Updated: 02 Feb 2024, 03:56 PM IST