Vizag Capital :`సుప్రీం` విచార‌ణ రోజే AP రాజ‌ధానిపై జ‌గ‌న్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

`గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు` 3 రాజ‌ధానులను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చేశారు.

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 02:20 PM IST

ఢిల్లీ వేదిక‌గా ఏపీ మూడు రాజ‌ధానుల అంశాన్ని `గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు` సాక్షిగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చేశారు. విశాఖప‌ట్నం ఏపీ రాజ‌ధాని(Vizag Capital) కాబోతుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో తాను విశాఖ‌ప‌ట్నం షిప్ట్ అవుతున్న‌ట్టు వెల్ల‌డించారు. షెడ్యూల్ ప్ర‌కారం మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు (Global summit) జరగనుంది. ఆలోపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న విశాఖ‌ప‌ట్నం నుంచి జ‌ర‌ప‌బోతున్నార‌న్న సంకేతం వ‌చ్చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన సంచ‌ట‌న ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి రాజ‌ధాని డిమాండ్ మీద నిప్పులు పోసింది.

విశాఖప‌ట్నం ఏపీ రాజ‌ధాని(Vizag Capital)

ఏపీకి పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని జగన్ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పిలుపునిచ్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉంటోందని వెల్లడించారు. పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వ‌చ్చే వాళ్ల‌కు అన్ని ర‌కాల స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో రాజ‌ధానుల అంశంపై పారిశ్రామిక వేత్త‌ల‌కు స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. అడ్మినిస్ట్రేష‌న్ కాపిట‌ల్ గా విశాఖ(Vizag Capital) మారుతుంద‌న్న బ‌ల‌మైన సంకేతాన్ని ఇచ్చారు. మూడు రాజ‌ధానుల అంశాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా కాలంగా చెబుతున్నారు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు కార‌ణంగా తాత్కాలికంగా వెనుక‌డుగు వేశారు. ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ దూకుడుగా విశాఖ వైపు అడుగులు వేయ‌డం గమ‌నార్హం.

Also Read : Vizag Capital : జగన్ విశాఖ కల, ఈ సారి బలమైన ముహూర్తం

మూడు నెలల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవ‌ల వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆయ‌న రాజ‌ధాని మీద క్లారిటీ ఇచ్చారు. విశాఖ రాజధానికి సంబంధించి అన్ని కార్యాచరణలు సిద్ధమవుతున్నాయ‌ని వెల్ల‌డించారు. రాజ‌ధాని కోసం అన్ని హంగుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ రాజ‌ధాని గురించి వెల్ల‌డించారు. మూడు రాజ‌ధానుల బిల్లు అసెంబ్లీలో పెట్ట‌క‌మునుపే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విశాఖ రాజ‌ధాని గురించి సంకేతాలు ఇచ్చిన విష‌యం అందిరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి వేడుక్కుతూ వ‌చ్చిన మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో ఉంది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటీవ‌ల సవాల్

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటీవ‌ల సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తీర్పులోని కొన్ని అంశాల‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. తాజాగా సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ దాఖ‌లుప‌రిచారు. అన్ని పిటిష‌న్లను క‌లిపి మంగ‌ళ‌వారం మూడు రాజధానులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? అనే ఉత్కంఠ నెల‌కొన్ని స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌కు షిఫ్ట్ (Global Summit)అవుతోన్న విష‌యాన్ని వెల్ల‌డించ‌డం హాట్ టాపిక్ అయింది.

Also Read : Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీల‌క కేంద్రం – ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ