త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఏ పార్టీ నేతలు ఎక్కడి నుండి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది ఉంది. ముఖ్యంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల అధినేతలు లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల తాలూకా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ(AP BJP) చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari) విశాఖ లోక్‌సభ(Vishaka Lok sabha) నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కేంద్ర బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పట్నుంచే ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పురంధేశ్వరి ఇంతకు ముందు 2009, 2019లలో కూడా విశాఖ నుంచే పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్(Congress) తరఫున విజయం సాధించారు కానీ, 2019లో మాత్రం బీజేపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కడ్నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి టీడీపీ-జనసేన పోత్తు ఉంటుందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఆ ధైర్యంతోనే ఆమె విశాఖ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా సరే, ఈ సరి విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించాలన్నది ఆమె కోరిక. విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు మరో నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది.
Read Also : Railway Budget : రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిందెంత..?