వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘటన తరువాత వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. చాలా మంది యువకులు ఫిషింగ్ హార్బర్‌ని మద్యం సేవించడానికి, గంజాయి తాగడానికి ఉపయోగిస్తారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా రాత్రి వేళల్లో హార్బర్‌లో దొంగతనాలు కూడా జరుగుతన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఓ రౌడీషీటర్ హత్య కూడా ఫిషింగ్ హార్బర్‌లో అక్రమ బంకర్‌ల వల్లేనని వార్తలు కూడా వచ్చాయి. 20 ఏళ్లలోపు యువకులు చిన్న కత్తులతో ప్రజలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తూ స్మార్ట్ వాచ్‌లు, ఫోన్‌లు తదితర విలువైన వస్తువులను దోచుకుంటున్నారని మత్స్యకారుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్‌లో నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని వారు తెలిపారు. పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని బోటు యజమానులు తెలిపారు. అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శించడానికి వచ్చి మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. చేపల వేటకు సెలవుల సమయంలో యువకులు మద్యం తాగి జూదమాడేందుకు బోట్లలో ఉంటున్నారని బోట్ల యాజమానులు తెలిపారు. కొంతకాలం క్రితం మద్యం మత్తులో ఓ మహిళను హత్య చేసి నీటిలో పడేసినట్లు వారు తెలిపారు. లంగరు వేసిన బోట్లలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని వన్ టౌన్ పోలీసులు అంగీకరించారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను పెంచుతామని పోలీసులు తెలిపారు.
Also Read: TANA : తానా ఇతర దేశాల్లో అందుబాటులోకి ఎన్‌టీఆర్ స్మారక నాణెం