Site icon HashtagU Telugu

Viveka’s Murder : పక్క ప్లాన్ తోనే వివేకా హత్య – సునీత కీలక వ్యాఖ్యలు

Sunitha Vivka

Sunitha Vivka

ఏపీలో ఎన్నికల (Elections 2024) జోరు కొనసాగుతున్న వేళ..మాజీ మంత్రి , వివేకా హత్య (Viveka’s Murder) కు సంబదించిన వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల సమయంలో వివేకాను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కు సంబదించిన కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP AVinash Reddy) కీలక వ్యక్తిగా ఉన్నారు. ఈయనతో పాటు పలువురు ఫై కేసు నమోదు అవ్వడం..అరెస్ట్ చేయడం..బెయిల్ ఫై బయటకు తిరుగుతుండడం జరుగుతుంది. వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్న..ఇంకా తమ కుటుంబానికి న్యాయం జరగలేదని, తన తండ్రిని చంపిన నేరగాళ్లకు శిక్ష పడలేదని వివేకా కూతురు సునీత (Sunitha) ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఆమె షర్మిల వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ..తన తండ్రిని చంపింది అవినాష్ రెడ్డి అని, అతడిని కాపాడుతూ వస్తుంది ముమ్మాటికీ ఈ సీఎం జగన్ మోహన్ రెడ్డే అంటూ మీడియా ముందు , ప్రజల ముందు వాపోతూ..ఇలాంటి శవ రాజకీయాలు చేసి గద్దె మీద కూర్చునే వారికీ ఓటు వెయ్యొద్దంటూ ఆమె కోరుతూ వస్తుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ..తన తండ్రి వివేకాను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని, రాజకీయాల నుండి వివేకాను కొందరు పక్కకు పెట్టాలని చూశారు.. అయినప్పటికీ ఆయన ప్రజా సేవలోనే ఉన్నారని గుర్తు చేశారు. దీంతో పక్కా స్కెచ్ వేసి తన తండ్రి వివేకాను హత్య చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్యను కొందరు పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యపై వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ..జగన్ మాటలనే సజ్జల చెబుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్యపై ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

Read Also : Risk Of Sunburn : ఔట్‌డోర్ వర్కర్లూ పారా హుషార్.. శాస్త్రవేత్తల వార్నింగ్