Vivekananda Reddy murder case: ఏపి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు(Kadapa Court) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే(stay) విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ జిల్లా వైపాకా అధ్యక్షడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాక, కడప కోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని… వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదనలను కూడా వినకుండా ఏకపక్షంగా ఆదేశాలను జారీ చేశారని తెలిపింది. కడప కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నామని… తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని చెప్పింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
Read Also: CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పన్ను ఎగవేస్తే అంతే సంగతి..!
కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలను కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును షర్మిల ప్రధానంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ కు జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు నేరస్తులకు, ధర్మం వైపు నిలబడ్డ వారికి మధ్య జరుగుతున్నాయని అన్నారు.