Site icon HashtagU Telugu

Viveka Murder Case: వివేకాను హత్య కేసులో ట్విస్ట్.. దస్తగిరి సంచలన నిజాలు!

Viveka Murder Case

Viveka Murder Case

వివేకా హత్య కేసు (Viveka Murder Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎంపీ అవినాశ్ రెడ్డిని (Avinash Reddy) విచారణ కోసం మరోమారు సీబీఐ పిలిచింది. అయితే అవినాశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సంబంధించి కీలక ఆధారాలున్నాయని, తమకు సహకరించడం లేదని సీబీఐ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు ఈ కేసు విచారణలో ఉండగానే, మరోవైపు అప్రూవర్ (Driver) డ్రైవర్ దస్తగిరి మీడియా ముందుకొచ్చి పలు విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది.

‘ రాజకీయ కారణాలతో వివేకాను హత్య చేశారు. ఎంపీ టికెట్, ఇతర విషయాలు కూడా హత్యకు దారితీశాయి.  సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan), ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది. ఈ కేసులో నేను అప్రూవర్‌గా మారడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. నేను అప్రూవర్‌గా మారే సమయంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు..?. మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు మాత్రం చెడ్డవారుగా మారాడా..?. సునీత నుంచి గానీ సీబీఐనుంచి గానీ నేను ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు. డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉండేందుకు కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎర్ర గంగిరెడ్డి చెబితేనే అప్పుడు డబ్బుకు ఆశపడి హత్య చేశాం. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. అందుకే నేను సీబీఐకి నిజం చెప్పేశాను’ అని దస్తగిరి మీడియాకు (Media) వెల్లడించారు.

నేను పారిపోయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు. పులివెందులలోని విజయమ్మ కాలనీలోనే నేను ఉన్నాను. మళ్లీ చెబుతున్నా నేను ఎక్కడికీ పారిపోను. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను తప్పు చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్తాను. మీరు (అవినాష్ రెడ్డిని ఉద్దేశించి) తప్పు చేస్తే మీరు కూడా జైలుకు వెళ్తారు. మీరు తప్పు చేసినట్లు రుజువైతే రాజీనామా చేస్తారా?. అవినాష్ పాత్ర ఉంది కాబట్టే సీబీఐ నోటీసులు ఇచ్చింది’ అని అవినాష్‌‌కు దస్తగిరి (Dastagiri) ఛాలెంజ్ చేశారు.

Also Read: Hyderabad Flyovers: జగ్‌నే కీ రాత్‌.. హైదరాబాద్ ఫ్లై ఓవర్లు బంద్!