Site icon HashtagU Telugu

Viveka : రేప‌టి వ‌ర‌కు ట్విస్ట్, CBIవ‌ల‌లో అవినాష్ రెడ్డి

Viveka

Avinash Reddy Case.. Cbi Searches For Clues In Pulivendula

ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ (Viveka) విచార‌ణ‌ను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. వాద‌న‌ల‌ను బుధ‌వారం వింటామ‌ని న్యాయ‌మూర్తి చెప్పారు. దీంతో హైద‌రాబాద్ నుంచి పులివెందుల‌కు ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) వెళ్లిపోయారని తెలిసింది. క‌డ‌ప‌లో భారీ ఏర్పాట్లతో సీబీఐ అధికారులు ఉన్నార‌ని తెలుస్తోంది. మూడు రోజులుగా క‌డ‌ప‌లోనే ఉన్న సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ లోని ఒక టీమ్ ఢిల్లీ వెళ్ల‌గా, మ‌రో టీమ్ క‌డ‌ప‌, పులివెందుల ప్రాంతాల్లోనే విచార‌ణ కొన‌సాగిస్తోంది.

ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ (Viveka) విచార‌ణ‌ వాయిదా

నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ అవినాష్ రెడ్డి(Avinash Reddy) అరెస్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అరెస్ట్ చేయొద్ద‌ని చెప్పిన తెలంగాణ హైకోర్టు విచార‌ణ‌ను బుధ‌వారంకు వాయిదా వేసింది. దీంతో సీబీఐ అధికారులు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు విచారించిన సీబీఐ అవినాష్ చుట్టూ వివేకానంద‌రెడ్డి హ‌త్య క‌థ ఉంద‌ని తెలుసుకుంది. సుమారు ఆరుసార్లు అవినాష్ రెడ్డి వివిధ కోణాల నుంచి విచార‌ణ చేసింది. ఆ త‌రువాత ఆయ‌న తండ్రి వైయస్ భాస్కర రెడ్డి అరెస్ట్ చేసింది. ఆనాటి నుంచి ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అవినాశ్ రెడ్డి ఆందోళ‌న చెందారు. అందుకే ముంద‌స్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

పులివెందుల‌కు ఎంపీ అవినాష్ రెడ్డి

ఆరు రోజుల క్రితం ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ఇరువైపుల వాదనలు వినడంతో పాటు, ఈ నెల 25న విచారణ, తీర్పు చెబుతామని తెలిపి, అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ క్ర‌మంలో బుధ‌వారం వాదనలు వింటామంటూ అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది. వాస్త‌వంగా మంగ‌ళ‌వారం ఉదయం ఈ కేసు హియరింగ్ కు వచ్చింది. త్వరగా విచారణ జరపాలని అవినాశ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని న్యాయమూర్తి చెప్ప‌డంతో వాయిదాకు కార‌ణ‌మైయింది. సుప్రీం కోర్టు డాక్యుమెంట్స్ లేకుండా విచారణ కొనసాగించలేమని, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా విచారణ ఉంటుందని జడ్జి తెలిపారు.

సుప్రీం ఆర్డ‌ర్ కాపీలోని ప్ర‌ధాన అంశాల‌ను బేరీజు

సుప్రీం ఆర్డ‌ర్ కాపీ లేక‌పోవ‌డంతో విచార‌ణ‌ను తొలుత మంగ‌ళ‌వారం ఉదయం నుంచి మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం గం.2.30కు విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు వినే క్రమంలో ఈ పిటిషన్ ను బుధ‌వారం విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. మరోవైపు, సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. అయినప్పటికీ దీనిని తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.

Also Read : viveka : అవినాష్ అరెస్ట్ వేళ సునితారెడ్డిపై పోస్ట‌ర్లు.!

సుప్రీం కోర్టు తీర్పును అనుస‌రించి తెలంగాణ హైకోర్టు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. తొలుత పాజిటివ్ గా అవినాష్ కు(Avinash Reddy) తీర్పు ఉంటుంద‌ని చాలా మంది భావించారు. కానీ, సుప్రీం కోర్టు కు ఈ విచార‌ణ పిటిష‌న్ వెళ్ల‌డంతో రివ‌ర్స్ గా క‌నిపిస్తోంది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్ కాపీలోని ప్ర‌ధాన అంశాల‌ను బేరీజు వేసుకుని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే సుప్రీం కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్ ను కొట్టివేసింది. అంతేకాదు, కేసు విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా అరెస్ట్ చేయొద్ద‌ని ఎలా ఉత్త‌ర్వులు ఇస్తార‌ని తెలంగాణ హైకోర్టును త‌ప్పుబ‌ట్టింది. స‌రిగ్గా ఈ కామెంట్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, అవినాష్ కు ముందుస్తు బెయిల్ ను తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఛాన్స్ క‌నిపించ‌డంలేదు. అంటే, ఆయ‌న అరెస్ట్ దాదాపుగా ఖాయ‌మ‌ని తొలి నుంచి వివేకా (Viveka)మర్డ‌ర్ కేసు ఎపిసోడ్ ను ఫాలో అవుతున్న వాళ్లు విశ్వ‌సిస్తున్నారు.

Also Read : Viveka:తాడేప‌ల్లికి సుప్రీం వేడి!అవినాష్ అరెస్ట్ త‌థ్యం?