Viveka : సుప్రీం, హైకోర్టుల్లో వివేకా హ‌త్య‌ కేసుపై కొత్త‌ ట్విస్ట్ లు

వివేకానంద‌రెడ్డి (Viveka) హ‌త్య కేసు సంద‌ర్భంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే అంశాల‌న్నింటినీ

  • Written By:
  • Updated On - April 20, 2023 / 05:48 PM IST

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి (Viveka) హ‌త్య కేసు విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో(Courts) ఉండే అనుకూల అంశాల‌న్నింటినీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ చాక‌చ‌క్యంగా తెర‌పైకి తీసుకొస్తోంది. ప్ర‌తిగా వివేకా కుమార్త్ డాక్ట‌ర్ సునీతారెడ్డి కూడా న్యాయ‌పోరాటం చేస్తూ ముందుకెళుతున్నారు. తాజాగా ద‌స్త‌గిరిని అప్రూవ‌ర్ గా మార్చ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వులు ఇవ్వాల‌ని భాస్క‌ర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణా రెడ్డి వేసిన పిటిష‌న్ల‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు ద‌స్త‌గిరిని కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోరింది. త‌దుప‌రి విచార‌ణ జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.

ద‌స్త‌గిరిని అప్రూవ‌ర్ గా మార్చ‌కుండా ఉత్వ‌ర్వులు ఇవ్వాల‌ని..(Viveka)

తెలంగాణ హైకోర్టు (Court)ఇచ్చిన డైరెక్ష‌న్ మేర‌కు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అరెస్ట్ చేయ‌కుండా విచారించడానికి కోర్టు అనుమ‌తించిన విష‌యం విదిత‌మే. ఈనెలాఖ‌రులోగా విచార‌ణను పూర్తి చేయ‌డానికి వేగంగా సీబీఐ అడుగులు వేస్తోంది. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ప్ర‌స్తుతం తెలంగాణ హైకోర్టులో ఉంది. దానిపై ఈనెల 25వ తేదీన కోర్టు తుది నిర్ణ‌యం తీసుకోనుంది. ఆ లోపుగా సునితారెడ్డి అప్ర‌మ‌త్తం అయ్యారు. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను స‌వాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లారు. విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం కోర్టు విచార‌ణను శుక్ర‌వారానికి వాయిదా వేసింది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్ల‌నున్నార‌ని

ఒక వైపు న్యాయ పోరాటం చేస్తూనే మ‌రో వైపు లాబీయింగ్ చేయ‌డానికి వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. మ‌రో రెండు రోజుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఆయ‌న ప‌ర్య‌ట‌న పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై మాత్ర‌మే ఉంటుంద‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ జ‌నార్థ‌న్ రెడ్డి చెబుతున్నారు. ఒక వేళ అమిత్ షాను ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లిస్తే మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి త‌ప్పించ‌డానికి మాత్ర‌మేనంటూ ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. అందుకు త‌గిన విధంగా లాబీయిస్ట్ విజ‌య‌కుమార్ ఎపిసోడ్ కూడా తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుమారు అర‌గంట పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆశీస్సులు ఇవ్వ‌డానికి తాడేప‌ల్లి కోట‌లోకి విజ‌య‌కుమార్ వెళ్లాడ‌ట‌. ఆ విష‌యాన్ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి చెప్ప‌డంతో లాబీయిస్ట్ వ్య‌వ‌హారంపై జ‌రుగుతోన్న చ‌ర్చ‌కు బ‌లం చేకూరుతోంది.

అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద ఉత్కంఠ (Courts)

మ‌రో ఐదు రోజుల పాటు అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద ఉత్కంఠ నెల‌కొంది. ఆ లోపుగా తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో (Courts) జ‌రిగే వాద‌న‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. కోర్టుల నిర్ణ‌యాలు కూడా మ‌రింత టెన్ష‌న్ పెంచుతున్నాయి. తాజాగా ద‌స్తగిరిని అప్రూవ‌ర్ గా తీసుకోవ‌ద్దంటూ తెలంగాణ‌లో వేసిన పిటిష‌న్ కేసును మ‌రో మ‌లుపు తిప్పేలా క‌నిపిస్తోంది. వాస్త‌వంగా సునీల్ యాద‌వ్‌, ఎర్ర‌ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ల‌తో క‌లిసి హ‌త్య పాల్గొన్నాన‌ని ద‌స్త‌గిరి చెబుతున్నాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని వాంగ్మూలంలో  చెప్పాడు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారని, ఎర్ర గంగిరెడ్డి వల్లే ఓడిపోయిన కోపం వివేకాకు ఉందని ద‌స్త‌గిరి చెప్పే వ‌ర్ష‌న్‌. అదే సమయంలో బెంగళూరులో స్థలంపై పంచాయతీకి పలుమార్లు వివేకా వెళ్లేవారని, ఆ స్థలంలో ఎర్ర గంగిరెడ్డి వాటా అడిగితే వివేకా ఆగ్రహించారని చెబుతున్నారు. 2018లో తాను వివేకా వద్ద పని మానివేసిన త‌రువాత తాము అందరం కలిసేవాళ్లమని, 2019 ఫిబ్రవరి 2న అంద‌రం ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళ్లామని చెప్పాడు. వివేకాను చంపాలని తమకు ఆయన సూచించినట్లు చెప్పాడు.

Also Read : Viveka : `అక్బ‌ర్ బాషా`కోణం, అవినాష్ కు మైనార్టీల వార్నింగ్

హత్య (Viveka) చేయమని చెప్పగా తాను ససేమీరా అన్నానని, వారు కూడా వస్తానని చెప్పారని తెలిపాడు. ఈ హత్యలో పెద్దల ప్రమేయం ఉందన్నాడు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఉన్నారని, శంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని, అందులో రూ.5 కోట్లు తనకు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడన్నాడు. మార్చి 14న తాము వివేకా ఇంటికి వెళ్లి, గొడ్డలితో దాడి చేశామని చెప్పాడు. హత్య తర్వాత తాము గోడ దూకి పారిపోయినట్లు చెప్పాడు. ఇదంతా దస్తగిరి గత ఏడాది ఆగస్ట్ 30న పొద్దుటూరు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. దాన్ని బేస్ చేసుకుని సీబీఐ విచార‌ణ వేగ‌వంతం చేసింది. ఇప్పుడు అత‌ను చెప్పినవ‌న్నీ అబ‌ద్దాల‌ని తెలంగాణ హైకోర్టులో భాస్క‌ర్ రెడ్డి, కృష్ణా రెడ్డి పిటిష‌న్లు దాఖ‌లు ప‌రిచారు. ద‌స్త‌గిరి ఇచ్చిన వాగ్మూలం చెల్ల‌కుండా , త‌ప్పుగా ప్ర‌క‌టించాలని హైకోర్టును (Courts) కోరారు. దానిపై హైకోర్టు జూన్ మూడో వారంలో ఎలా స్పందిస్తుందో చూసే కంటే ముందు ఈనెల 25న తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.

Also Read : Viveka Murder Case: వివేకాను హత్య కేసులో ట్విస్ట్.. దస్తగిరి సంచలన నిజాలు!