Site icon HashtagU Telugu

Viveka Murder :నో బెయిల్ ఓన్లీ అరెస్ట్,తాడేప‌ల్లికిCBI?

Viveka Murder.

Viveka Murder.

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి  (Viveka Murder) అరెస్ట్ క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ రేపుతోంది. అదిగో పులి సామెత‌గా ఇదిగో అరెస్ట్ అనే ప‌రిస్థితికి ఆయ‌న అరెస్ట్ అంశం వ‌చ్చింది. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఏ 1గా ఉన్న గంగిరెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. వ‌చ్చే నెల 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవ‌డానికి అవ‌కాశం ఇచ్చింది. అంతేకాదు, ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా త‌థ్య‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. అరెస్ట్ త‌ప్ప‌ద‌నే విష‌యాన్ని అవినాష్ రెడ్డి(Avinash Reddy) తో పాటు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. అరెస్ట్ అయిన‌ప్ప‌టికీ బెయిల్ వ‌స్తుంద‌ని రాచ‌మ‌ల్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అవినాష్ రెడ్డి అరెస్ట్ క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ (Viveka Murder)

నాలుగేళ్లుగా వివేకా హ‌త్య‌ను ప‌లు కోణాల నుంచి సీబీఐ విచారించింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మ‌లుపులు తిరుగుతూ ఇప్పుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy) అరెస్ట్ వ‌ర‌కు వ‌చ్చింది. హ‌త్య వెనుక అవినాష్ రెడ్డి పాత్ర ఉంద‌ని ఇప్ప‌టికే సీబీఐ ఒక నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. ఆ రోజు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, భార‌తిల‌కు ఫోన్లు చేసిన విష‌యాన్ని కూడా నిర్థారించుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి వ‌చ్చిన ఫోన్ ను భార‌తి పీఏ న‌వీన్ రిసీవ్ చేసుకున్న విష‌యాన్ని కూడా సీబీఐ తెలుసుకుంది. అంతేకాదు, హ‌త్య(Viveka Murder) జ‌రిగిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మాట్లాడిన ఓఎస్డీ కృష్ణారెడ్డిని కూడా సీబీఐ విచారించింది. రెండు రోజుల క్రితం అవినాష్ రెడ్డి వ‌ద్ద ఉన్న కంప్యూట‌ర ఆపరేట‌ర్ నుంచి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టింది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, భార‌తిల‌కు ఫోన్లు 

గ‌త వారం వ‌ర‌కు క‌స్ట‌డీలో ఉన్న అవినాష్ రెడ్డి(Avinash Reddy) తండ్రి భాస్క‌ర్ రెడ్డి, ఉద‌య్ కుమార్ రెడ్డిల‌ను సీబీఐ విచార‌ణ చేసింది. వాళ్లిద్ద‌రి నుంచి కీల‌క స‌మాచారాన్ని సేక‌రించిన త‌రువాత అవినాష్ రెడ్డి వైపు సీబీఐ చూసింది. ఆ లోపుగా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష‌న్ వేసిన విష‌యం విదిత‌మే. దానిపై తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది. దీంతో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బెయిల్ పిటిష‌న్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇక ఆయ‌న అరెస్ట్ త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు. మ‌రో వైపు అవినాష్ రెడ్డి వేసిన ముంద‌స్తు బెయిల్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఛాన్స్ లేదు. దీంతో ఆయ‌న్ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది.

అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కుమార్తె సునీతారెడ్డిని (Viveka Murder)

ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు, ఇచ్చిన లేఖ ఆధారంగా వివేకానంద‌రెడ్డి అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కుమార్తె సునీతారెడ్డిని సీబీఐ విచారించింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు విచారించిన సీబీఐ వాళ్ల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. మ‌రోసారి మ‌ళ్లీ బుధ‌వారం వాళ్లిద్ద‌ర్నీ విచార‌ణ చేసింది. ప‌లు కీల‌క అంశాల‌ను రాజ‌శేఖ‌ర్ రెడ్డి, డాక్ట‌ర్ సునితారెడ్డి నుంచి సీబీఐ రాబ‌ట్టింది. ఆ మేర‌కు వాళ్ల నుంచి వాగ్మూలం తీసుకుంది. అదే రోజు మీడియాతో మాట్లాడిన వైఎస్ ష‌ర్మిల ఆస్తుల‌కు సంబంధించిన హ‌త్య(Viveka Murder) కాద‌ని తేల్చేశారు. దీంతో ఆమెకు కూడా సీబీఐ నోటీసులు ఇస్తూ విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏ1 గంగిరెడ్డి బెయిల్ పిటిష‌న్ ర‌ద్దు కావ‌డంతో తాడేప‌ల్లి కోటలోని భార‌తి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు స‌హ‌జంగా సీబీఐ చూస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది.

శివ‌ప్ర‌కాశ్ రెడ్డిని విచార‌ణ చేయాల‌ని సీబీఐని (Avinash Reddy)

అరెస్ట్ త‌ప్ప‌ద‌ని భావించిన క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) గురువారం మీడియా ముందుకొచ్చారు. వివేకా హ‌త్య‌ను మ‌రో కోణం నుంచి ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశంలోని లేఖ‌, ఫోన్ గురించి సీబీఐ ప్ర‌శ్నించాల‌ని కోరుతున్నారు. ఆ లేఖ‌, ఫోన్ ను దాచాల‌ని వివేకానంద‌రెడ్డి అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎందుకు చెప్పారు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం రాబ‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కేవ‌లం ద‌స్త‌గిరి అప్రూవ‌ర్ గా మారుతూ చెప్పిన వాగ్మూలం బేస్ చేసుకుని సీబీఐ విచార‌ణ చేస్తుంద‌ని ఆరోపించారు. వివేకానంద‌రెడ్డి అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, సునితారెడ్డి ఆస్తుల గొడ‌వ గురించి ప్ర‌జ‌ల‌కు తెలియాల‌ని అన్నారు. హ‌త్య జ‌రిగిన రోజు జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్ర‌చారానికి వెళుతుండ‌గా శివ‌ప్ర‌కాశ్ రెడ్డి ఫోన్ చేసిన విష‌యాన్ని అవినాష్ గుర్తు చేశారు. వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణించిన (Veveka Murder)విష‌యాన్ని తొలుత ఫోన్ చేసి చెప్పిన శివ‌ప్ర‌కాశ్ రెడ్డిని విచార‌ణ చేయాల‌ని సీబీఐని కోరారు. మొత్తం మీద అరెస్ట్ త‌ప్ప‌ద‌ని భావిస్తోన్న అవినాష్ రెడ్డి చివ‌రి ప్ర‌య‌త్నంగా శివ‌ప్ర‌కాశ్ రెడ్డిని సీన్లోకి దింపాల‌ని చూస్తున్నారు.

వివేకానందరెడ్డి రెండో భార్య‌గా ష‌మీమ్ సీన్లోకి  

గ‌త వారం వివేకానందరెడ్డి రెండో భార్య‌గా ష‌మీమ్ సీన్లోకి వ‌చ్చారు. మూడు పేజీల లేఖ‌ను కూడా సీబీఐకి రాశారు. ఆ లేఖ‌లో పెళ్లి చేసుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కుమారుడు కూడా ఉన్నాడ‌ని చెప్పారు. బెంగుళూరు కేంద్రంగా చేసుకుని జ‌రిగిన ఒక సెటిల్మెంట్ తాలూకా సొమ్ము రూ. 8కోట్లు వ‌స్తుంద‌ని హ‌త్య‌కు ముందుగా వివేకానంద‌రెడ్డి చెప్పిన‌ట్టు లేఖ‌లో పొందుప‌రిచారు. అంతేకాదు, కుమారుడికి రాజ‌కీయ వార‌స‌త్వం, ఆస్తుల్లో వాటా కూడా ఇస్తామ‌ని వివేకాచెప్పిన‌ట్టు ఆ లేఖ‌లోని సారాంశం. రెండో వివాహం చేసుకున్న త‌రువాత డాక్ట‌ర్ సునీతారెడ్డి, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, శివ‌ప్ర‌కాశ్ రెడ్డి బెదిరించార‌ని ష‌మీమ్ సీబీఐకి రాసిన లేఖ‌లోని ప్ర‌ధాన అంశం. దాని చుట్టూ విచార‌ణ సాగుతుంద‌ని చాలా మంది భావించారు. కానీ, హ‌త్య అవినాష్(Avinash Reddy) కుట్ర ప‌న్నార‌ని నిర్థారించుకున్న సీబీఐ ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి సిద్ద‌మ‌యింది.

Also Read : viveka : అవినాష్ అరెస్ట్ వేళ సునితారెడ్డిపై పోస్ట‌ర్లు.!

ఒక వేళ అవినాష్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ అయితే, ఆ త‌రువాత వైఎస్ భార‌తి చుట్టూ వివేకా హ‌త్య కేసు విచార‌ణ మ‌లుపు తిరిగే అవ‌కాశం ఉంది. అప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని టీడీపీ భావిస్తోంది. ఇప్ప‌టికే వైఎస్ కుటుంబంలోని అంత‌ర్గ‌త హ‌త్య‌గా నిర్థార‌ణ దాదాపుగా జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ హ‌త్య‌ను(Viveka Murder) చంద్ర‌బాబు మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ వేసింది. ఇప్పుడు అదే విష‌యాన్ని చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌ల్లో చెబుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుట్ర‌ల‌ను గ‌మ‌నించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సులు లేక‌పోతే తాడేప‌ల్లి కోట‌కు సీబీఐ నోటీసులు వెళ్లే ఛాన్స్ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Viveka:తాడేప‌ల్లికి సుప్రీం వేడి!అవినాష్ అరెస్ట్ త‌థ్యం?