Viveka Murder : తాడేపలి రాణివాసంపై..స్క్రీన్ షాట్ ! వివేకా మ‌ర్డ‌ర్ ట్విస్ట్

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల మెడ‌కు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka Murder) కేసు చుట్టుకుంటోంది.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 04:26 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల మెడ‌కు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka Murder) కేసు చుట్టుకుంటోంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన వాట్సప్ సంభాష‌ణ స్క్రీన్ షాట్ ల‌ను సీబీఐకి అందించారు సునీత‌. దీంతో వివేకా హ‌త్య కేసు కొత్త ట్విస్ట్ ను తీసుకుంది. పొలిటిక‌ల్ మ‌ర్డ‌ర్ గా వైఎస్ ష‌ర్మిల ఇచ్చిన వాగ్మూలంను సీబీఐ చార్జీషీట్లో పొందుప‌రిచారు. హ‌త్య‌కు కార‌కులు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ చార్జిషీట్లో క్లియ‌ర్ గా పేర్కొంది. దానికి బ‌లం చేకూరేలా భార‌తి, సజ్జ‌ల మ‌ధ్య ఆ రోజు జ‌రిగిన సంభాష‌ణ స్క్రీన్ షాట్ ల‌ను డాక్ట‌ర్ సునీత సీబీఐకి అంద‌చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

భార‌తి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల మెడ‌కు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka Murder)

హ‌త్య జ‌రిగిన త‌రువార జ‌రిగిన ప‌రిణామాల‌ను గుర్తు చేసుకుంటూ సీబీఐకి అన్ని విష‌యాల‌ను డాక్ట‌ర్ సునీత (Viveka Murder)వివ‌రించారు. 2019 మార్చి 22న జ‌రిగిన సంఘ‌ట‌న హ‌త్య కేసును నిరూపించేలా ఉంది. ఆ రోజున వైఎస్ భారతి సునీత‌కు ఫోన్ చేసి ఇంటికి వ‌స్తాన‌ని చెప్పార‌ట‌. కానీ, కడప, సైబరాబాద్ కమిషనరేట్లకు వెళ్లాల్సి ఉందని సునీత రిప్లై ఇచ్చారు. ప్లీజ్ ఎక్కువ సమయం తీసుకోనని చెప్పిన భారతి క్ష‌ణాల్లో సునీత ఇంటి ముందు వాటిపోయారు. ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావ‌డం సునీత‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. లిఫ్ట్ వద్దే భారతితో సునీత మాట్లాడారు. ఆ స‌మ‌యంలో భార‌తి ఆందోళ‌న‌గా ఉన్న‌ట్టు సునీత గుర్తించారు.

వివేకానంద‌రెడ్డి, అవినాష్ రెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలు

సీబీఐకి సునీత చెప్పిన దానికి ప్ర‌కారం ఆ రోజు భార‌తి పరామ‌ర్శ కోసం వ‌స్తుంద‌ని భావించింది. తొలిసారి ఇంటికి వ‌చ్చిన భార‌తి త‌న తండ్రి చ‌నిపోయార‌ని సానుభూతి చూపుతుంద‌ని భావించారు. అదే స‌మ‌యంలో కొన్ని డైరెక్ష‌న్ల‌ను భార‌తి ఇచ్చింద‌ట‌. అవేమంటే, ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని సునీత‌కు భార‌తి సున్నితంగా చెప్పారట‌. అంతేకాదు, అక్క‌డ ఉన్న స‌జ్జ‌ల‌ హత్య గురించి మీడియాతో మాట్లాడాలని సునీత‌కు చెప్పాడు. ఆ స‌మ‌యంలో ఇబ్బంది అనిపించ‌డంతో వీడియో షూట్ చేసి స‌జ్జ‌ల‌కు పంపారు. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియోను పంపించారు.వీడియో పంపించడం కాదు, ఈ వివాదానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పార‌ట‌. జగనన్నతో పాటు అవినాశ్ పేరును కూడా ప్రస్తావించాలని సలహా ఇచ్చారు. అప్పటి వరకు ఎక్కడా అవినాశ్ పేరును సునీత ప్ర‌స్తావించ‌లేదు. ప్రెస్మీట్లో అవినాశ్ పేరును ప్రస్తావించాలని స‌జ్జ‌ల చెప్పినప్పుడు సునీత‌కు తొలిసారి (Viveka Murder)అనుమానం క‌లిగింది.

వైఎస్ భారతి, సజ్జల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి సమర్పించ‌డంతో (Viveka Murder)

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి, అవినాష్ రెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలు ఉన్నాయని సునీత వివ‌రించారు. సజ్జల సలహా మేరకే హైదరాబాదులో తాను ప్రెస్ మీట్ పెట్టానని సీబీఐకి వివ‌రించారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తొలి నుంచి అడుగుతున్నానని అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని… ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని చెప్పారు. పొరపాటు జరిగిందనే విషయం తనకు తెలుసని… క్రిమినల్ మైండ్  (Viveka Murder) ఎలా పని చేస్తుందో మాత్రం అర్థం చేసుకోలేదని సునీత ఇచ్చిన వాగ్మూలం.

Also Read : YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు పై నేడు సిబిఐ కోర్టులో విచారణ

హ‌త్య జ‌రిగిన రోజు మార్చురీ బయట ఉన్నప్పుడు ఒక ఫిర్యాదును రాసుకొచ్చి సంతకం చేయమన్నారని సునీత సీబీఐకి వివ‌రించారు. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా చేసిన ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని, టీడీపీ నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాశ్ ఆరోజు త‌న‌తో అన్నారని సునీత చెప్పారు. అయితే, ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని వెల్లడించారు.

2019 జులైలోనే అవినాశ్ పై అనుమానం మొదలయిందని సునీత చెబుతున్నారు. వివేకా హ‌త్య‌ విషయం తన కుమారుడికి ముందే తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని సునీత వివ‌రించారు. అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. వైఎస్ భారతి, సజ్జల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి సమర్పించ‌డంతో మ‌ర్డ‌ర్ కేసు స‌రికొత్త మ‌లుపు తిరిగింది.

Also Read : YS Viveka Murder Case : సుప్రీంకోర్టులో వివేక హ‌త్య కేసు విచార‌ణ‌

ఈనెలాఖ‌రుకు సుప్రీం కోర్టులో మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసుకు సంబంధించిన తుది నివేదిక‌ను సీబీఐ ఇవ్వాలి. ఆ మేర‌కు ప‌లువున్ని అరెస్ట్ చేసింది. కానీ, ఎంపీ అవినాష్ రెడ్డిని మాత్రం సీబీఐ అరెస్ట్ చేసి, క‌స్ట‌డీలోకి తీసుకోలేక‌పోయింది. రికార్డ్ ప్ర‌కారం మాత్ర‌మే ఆయ‌న్ను అరెస్ట్ చేసిన‌ట్టు చూపించారు. కానీ, ఆయ‌న చుట్టూ ఎప్ప‌టి నుంచో ఈ కేసు తిరుగుతోంది. తాడేప‌ల్లి ప్యాలెస్ డైరెక్ష‌న్లో ఈ హ‌త్య వ్య‌వ‌హారంపై న‌డిచింద‌ని సీబీఐ తొలి నుంచి అనుమానించింది. ఆ మేర‌కు భార‌తి వ్య‌క్తిగ‌త స‌హాయ‌డు, ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్ ల‌ను కూడా సీబీఐ విచారించింది. ఇప్పుడు భార‌తి, స‌జ్జ‌ల మధ్య హ‌త్య  (Viveka Murder) రోజు జ‌రిగిన వాట్స‌ప్ చాట్ ల సంభాష‌ణ స్క్రీన్ షాట్ ల‌తో అస‌లు ర‌హస్యం బ‌ట్ట‌బ‌య‌లు అవుతోంది.