Site icon HashtagU Telugu

Viveka Murder : YS క్రైమ్ థ్రిల్ల‌ర్! వివేకా హ‌త్యలో DNA ట్విస్ట్?

Viveka Murder

Viveka Murder

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య(Viveka Murder)  సినిమా మ‌లుపుల‌ను త‌ల‌పిస్తోంది. క‌డ‌ప ఎంపీ సీటు కోసం, ఆస్తుల వివాదాలు, రెండో వివాహం..ఇలా మూడు అంశాల చుట్టూ(CBI) క‌థ‌ల‌ను అల్లేస్తున్నారు. ఎవ‌రికి అనుకూలంగా వాళ్లు స్క్రిప్ట్ రాసేస్తున్నారు. హ‌త్య కేసు వెనుక ఉన్న‌ నిజాల‌ను బ‌య‌ట పెట్టాల్సిన సీబీఐ ద‌స్త‌గిరి వాగ్మూలం చుట్టూ తిరుగుతోంది. స‌రిగ్గా ఇక్క‌డే క‌థ‌ను తాజాగా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి మ‌రో మ‌లుపు తిప్పారు. మూడు ర‌కాల వాగ్మూలాల‌ను ద‌స్త‌గిరి ఇచ్చిన విష‌యాన్ని బ‌య‌ట‌కు లాగారు. రెండో వాగ్మూలం కాకుండా మొద‌టి వాగ్మూలం ప్ర‌కారం విచార‌ణ చేయాల‌ని సీబీఐని తాజాగా అవినాష్ రెడ్డి కోరుతున్నారు.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య(Viveka Murder)

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబం చుట్టూ తిరుగుతోన్న ఈ హ‌త్య(Viveka Murder) కేసు నాలుగేళ్లుగా క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. విచార‌ణ‌లో భాగంగా ఇటీవ‌ల వైఎస్ భార‌తి పీఏ న‌వీన్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్ రెడ్డిని కూడా సీబీఐ విచారించింది. దీంతో తాడేప‌ల్లి కోట పాత్ర ఉంద‌ని టీడీపీ చెబుతోన్న వాద‌న‌కు బ‌లం చేకూరింది. హ‌త్య జ‌రిగిన వెంట‌నే జగ‌న్‌, భార‌తీకి ఫోన్లు వెళ్లిన ఉదంతాన్ని బేస్ చేసుకుని వాళ్లిద్ద‌రికీ సీబీఐ(CBI) నోటీసులు ఇవ్వాల‌ని టీడీపీ చేస్తోన్న డిమాండ్‌. ఢిల్లీ నుంచి తాడేప‌ల్లి వ‌యా హైద‌రాబాద్ వ‌ర‌కు ప్ర‌తి రోజూ హ‌త్య కేసు విచార‌ణ ట్విస్ట్ లు వైసీపీకి టెన్ష‌న్ పుట్టిస్తుండ‌గా, ప్ర‌త్యర్థుల‌కు ఆస‌క్తిగా మారింది. అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఇంచుమించు ఒకేలా ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అవినాష్ అరెస్ట్ లేకుండా ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి.

ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అవినాష్ అరెస్ట్ లేకుండా ఉప‌శ‌మ‌నం

వివేకా హ‌త్య కేసు(Viveka Murder) విచార‌ణ న్యాయ‌స్థానాల మ‌ధ్య కూడా సంఘ‌ర్ష‌ణ క‌లిగించేలా ఉంది. ఈనెలాఖ‌రు నాటికి విచార‌ణ పూర్తి చేయాల‌ని సుప్రీం కోర్టు సీబీఐని(CBI) ఆదేశించిన విష‌యం విదిత‌మే. అంతేకాదు, సుప్రీం కోర్టు వేసిన ద‌ర్యాప్తు బృందానికి తెలంగాణ హైకోర్టు ప‌రోక్షంగా అడ్డు త‌గులుతుంద‌న్న భావన క‌లిగేలా అవినాష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అరెస్ట్ చేయ‌కుండా చేయ‌గ‌లిగింది. స‌రిగ్గా ఇక్క‌డే తెలంగాణ హైకోర్టు వాల‌కాన్ని సుప్రీం కోర్టు మ‌రోలా చూస్తోంద‌ని న్యాయ నిపుణుల అభిప్రాయం. ఇదిలా ఉంటే, ద‌స్త‌గిరి అప్రూవ‌ర్ గా గుర్తించ‌కుండా ఆర్డ‌ర్ ఇవ్వాల‌ని శుక్ర‌వారం మ‌రో పిటిష‌న్ భాస్క‌ర్ రెడ్డి, కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో వేయ‌డం విచిత్రం. ఇక అప్రూవ‌ర్ గా మారిన ద‌స్త‌గిరి ఇచ్చిన మొద‌టి వాగ్మూలాన్ని చూడాల‌ని రాత‌పూర్వ‌కంగా అవినాష్ రెడ్డి సీబీఐని కోరుతున్నారు. అదే జ‌రిగితే, బెంగుళూరు కేంద్రంగా జ‌రిగిన భూ వివాదాల సెల్మెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఆయ‌న ఉద్దేశం.

ద‌స్త‌గిరి ఇచ్చిన మొద‌టి వాగ్మూలాన్ని చూడాల‌ని అవినాష్ రెడ్డి(CBI)

మూడు పేజీలతో కూడిన ఒక లేఖ‌ను వివేకా రెండో భార్య‌గా చెబుతోన్న షేక్ ష‌మీమ్ సీబీఐకి (CBI) అంద‌చేసింది. దీంతో వివేకా హ‌త్య కేసు మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్టు అయింది. ఆమె రాసిన లేఖ ప్ర‌కారం `వివేకా రెండో వివాహం షేక్ ష‌మీమ్ తో జ‌రిగింది. ఒక కుమారుడు షేక్ షేహాన్ షా వాళ్ల‌కు ఉన్నాడు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ తాలూకూ 8కోట్లు వ‌స్తాయ‌ని హ‌త్య‌కు ముందు రోజు ష‌మీమ్ తో వివేకా చెప్పాడు. రెండో వివాహం చేసుకోవ‌డం వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత్ కు, శివ‌ప్ర‌కాష్ రెడ్డికి ఇష్టంలేదు. ప‌లుమార్లు బెదిరించారు. కుమారుడ్ని రాజ‌కీయ వార‌సునిగా చేయాల‌ని వివేకా అనుకున్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాల‌ని భావించాడు. అందుకే కుమార్తె సునీతారెడ్డి, శివ‌ప్ర‌కాష్ రెడ్డి నిరాక‌రించారు. ` ఇదీ క్లుప్తంగా సీబీఐకి ఆమె రాసిన లేఖ‌లోని సారాంశం.

వివేకా రెండో భార్య‌గా చెబుతోన్న షేక్ ష‌మీమ్ సీబీఐకి(Viveka Murder)

ఇదే వాద‌న‌ను వినిపిస్తూ సోమ‌వారం తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డానికి వివేకానంద‌రెడ్డి రెండో భార్య‌గా చెబుతోన్న షేక్ ష‌మీమి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. డీఎన్ ఏ టెస్ట్ చేయ‌డం ద్వారా కుమారుడు షేక్ షేహాన్ షా త‌మ‌కు పుట్టిన బిడ్డా? కాదా? అనేది కూడా తేల్చాల‌ని ఆమె పిటిష‌న్ వేయ‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే, ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐకి (CBI) అవినాష్ చెబుతోన్న రెండో వివాహం, ఆస్తుల గొడ‌వ‌ల వైపుకు వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka Murder) మ‌లుపు తిరిగే ఛాన్స్ ఉంది.

Also Read : Viveka Murder Case: వివేకా కేసులో ట్విస్ట్, అవినాష్ ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే

వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka Murder) వెనుక లైంగిక వేధింపులు ఉన్నాయ‌ని నిందితుడు సునీల్ యాద‌వ్ ఒక క‌థ‌ను వినిపించారు. ద‌స్త‌గిరి మూడు వాగ్మూలాలు ఇచ్చాడు.  హ‌త్య వెనుక వివాహేత‌ర సంబంధం ఉంద‌ని ఎంపీ అవినాష్ రెడ్డి రాత‌పూర్వ‌కంగా సీబీఐకి అందించాడు. చంద్ర‌బాబునాయుడు చేయించిన హ‌త్య‌గా ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాడేప‌ల్లి పెద్ద‌లు క‌లిసి చేసిన హ‌త్య‌గా డాక్ట‌ర్ సునితారెడ్డి అనుమానిస్తున్నారు. హంత‌కులు ఎవ‌రైనా స‌రే వాళ్ల‌కు శిక్ష ప‌డాల‌ని విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కోరుతున్నారు. ఇలాంటి వాద‌న‌ల న‌డుమ సీబీఐ (CBI) ఈ కేసును తేల్చ‌గ‌ల‌దా? అంటే న‌మ్మ‌కం రావ‌డంలేదు. ఒక‌వేళ వివేకా రెండో భార్య‌గా షేక్ ష‌మీమి తెలంగాణ హైకోర్టు లో సోమ‌వారం పిటిష‌న్ దాఖ‌లు చేస్తే మ‌రో మ‌లుపు ఈ హ‌త్య కేసు విచార‌ణ తిరగ‌నుంది.

Also Read : Viveka : `అక్బ‌ర్ బాషా`కోణం, అవినాష్ కు మైనార్టీల వార్నింగ్