Viveka Murder : హ‌త్య కేసులో అవినాష్ నిందితుడు, A 8గా న‌మోదు

వివేకా హ‌త్య(Viveka Murder)కేసులో అవినాష్ రెడ్డి నిందితుడ‌ని సీబీఐ తేల్చింది.నిందితుడా? అనుమానితుడా?అంటూ కోర్టు ప్ర‌శ్నించిన విష‌యం విదిత‌మే.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 05:14 PM IST

మాజీ మంత్రి వివేకా హ‌త్య(Viveka Murder)  కేసులో క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడ‌ని సీబీఐ తేల్చింది. ఇప్ప‌టి వర‌కు ఆయ‌న నిందితుడా? అనుమానితుడా? అంటూ కోర్టు ప్ర‌శ్నించిన విష‌యం విదిత‌మే. అయితే, తాజాగా భాస్క‌ర్ రెడ్డి బెయిల్ పిటిష‌న్ కు కౌంట‌ర్ వేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా(A8) చేర్చింది. హ‌త్య జ‌రిగిన త‌రువాత సాక్ష్యాల‌ను తారుమారుచేసే ప్ర‌య‌త్నం అవినాష్ రెడ్డి చేశార‌ని అఫిడ‌విట్ లో పేర్కొంది. సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో శుక్ర‌వారం దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడ‌ని(Viveka Murder) 

ముంద‌స్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి ఇక సేఫ్ జోన్లోకి వెళ్లిన‌ట్టు వైసీపీ భావించింది. కానీ, సీబీఐ దూకుడును మ‌ళ్లీ పెంచింది. ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని చెబుతోంది. హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని సాక్ష్యాల‌తో స‌హా ప‌ట్టుకున్నామ‌న్న విష‌యాన్ని సీబీఐ చెబుతోంది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది. మ‌రో నిందితుడు శివ‌శంక‌ర్ రెడ్డి. ఫోన్ చేసిన నిమిషంలోనే హ‌త్య జ‌రిగిన ప్రాంతానికి అవినాష్ రెడ్డి చేరుకున్నార‌ని అఫిడ‌విట్ లో సీబీఐ(Viveka Murder ) పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చుతూ అఫిడ‌విట్ వేయ‌డం స‌రికొత్త ట్విస్ట్‌

ప‌లు మ‌లుపులు తిరుగుతూ వ‌స్తోన్న వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు (Viveka Murder) విచార‌ణ ఈనెల 30వ తేదీ లోపు ముగించాలి. ఆ మేర‌కు సుప్రీం కోర్టు ఆర్డ‌ర్స్ ఉన్నాయి. అందుకే, సీబీఐ మ‌రోసారి దూకుడు పెంచింది. ఇప్ప‌టికే లేఖ మీద ఉన్న వేలి ముద్ర‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ లేఖ‌ను బ‌ల‌వంతంగా వివేకానంద‌రెడ్డి రాశార‌ని సీబీఐ నిర్థారించుకుంది. అయితే, వేలి ముద్ర‌ల‌ను తెలుసుకోవ‌డానికి అనువుగా నిన్ హైడ్రిన్ ప‌రీక్ష చేయ‌డానికి కోర్టు నుంచి సీబీఐ అనుమ‌తి తీసుకుంది. ఆ టెస్ట్ ద్వారా నిందితుల‌ను ప‌క్కాగా తెలుసుకోవాల‌ని సీబీఐ నిర్థారించుకుంది. మొత్తం మీద ప‌లు కోణాల నుంచి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసిన సీబీఐ కోర్టుల్లోని అడ్డంకుల‌ను కూడా క్లియ‌ర్ చేసుకుంటోంది. ఆ క్ర‌మంలో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చుతూ అఫిడ‌విట్ వేయ‌డం స‌రికొత్త ట్విస్ట్‌.

Also Read : Viveka Murder : అవినాష్ కు బెయిల్, ఇక వివేకా హ‌త్య విచార‌ణ‌.!

తండ్రి భాస్క‌ర్ రెడ్డితో క‌లిసి అవినాష్ రెడ్డి ఈ హ‌త్య కేసులో(Viveka Murder) కీల‌కంగా ఉన్నార‌ని సీబీఐ చెబుతోంది. అందుకు సంబంధించిన ఆధారాలు లేవ‌ని ఇటీవ‌ల హైకోర్టు చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే, అదే కోర్టులో భాస్క‌ర్ రెడ్డి బెయిల్ పిటిష‌న్ కు కౌంట‌ర్ గా వేసిన అఫిడ‌విట్ లో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చుతూ సీబీఐ ఈ కేసును ముందుకు న‌డిపిస్తోంది. శుక్ర‌వారం కోర్టులో దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆ సంద‌ర్భంగా కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read : YS Viveka Murder Case: వైస్ సునీతపై అనుమానం వ్యక్తం చేసిన వైస్ఆర్ సోదరి