మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య(Viveka murder) కేసు దర్యాప్తు నిన్ హైడ్రేట్ టెస్ట్ వరకు వెళ్లింది. హత్య జరిగిన రోజు ఉన్న ఒకేఒక ఆధారం ఆయన రాసిన లేఖ. దాన్ని నిన్ హైడ్రేట్ టెస్ట్ చేయడం ద్వారా వేలిముద్రలను(Finger prints) గుర్తించడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ మేరకు కోర్టును సీబీఐ కోరడం హత్య కేసులోని కీలక మలుపు. హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నిన్ హైడ్రేట్ టెస్ట్(Viveka murder)
వివేకా రాసిన లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు సీబీఐ కసరత్తు మొదలుపెట్టింది. వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష మీద ఆధారపడింది. ఈ నేపథ్యంలో నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని కోరుతూ సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై నిందితుల అభిప్రాయాలు తెలపాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై జూన్ 2న సీబీఐ కోర్టు విచారణ జరపనుంది.
హత్యాస్థలిలో (Viveka murder) లభించిన లేఖను సీబీఐ అధికారులు 2022, ఫిబ్రవరి 11న సీఎఫ్‌ఎస్‌ఎల్ పంపించి రెండు ప్రధాన అంశాలను తెలియజేయాలని కోరారు. లేఖను ఒత్తిడిలో రాశారా? లేదా? తేల్చాలని లేఖ రాశారు. అనంతరం వివేకా రాసిన ఇతర లేఖలను పోల్చి చూసిన తర్వాత ఆయన ఒత్తిడిలో లేఖ రాసినట్లు ఫోరెన్సిక్ నివేదికలు తేల్చాయి. తాజాగా లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీబీఐ(CBI) నిర్ణయించింది. అయితే, లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్ ను సీబీఐ అధికారులు కోరారు.
నిన్‌హైడ్రేట్ పరీక్ష వల్ల..
ఈ పరీక్ష ద్వారా లేఖపై చేతి రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని వివరించింది. హత్య కేసు విచారణలో లేఖ ఇప్పుడు కీలక సాక్ష్యంగా ఉంది. ఒకవేళ పరీక్షలో లేఖ దెబ్బతిన్నట్లయితే దర్యాప్తు, ట్రయల్‌పై ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్‌ను రికార్డులో భద్రపరిచి దాన్ని సాక్ష్యంగా పరిగణించేందుకు అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని కోరారు. వివేకాతో బలవంతంగా లేఖ రాయించినట్లుగా దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై జూన్ 2న న్యాయస్థానం విచారణ జరపనుంది.
Also Read : Viveka Murder : గొడ్డలి,లేఖపై దర్యాప్తు,అవినాష్ అరెస్ట్ కు CBI మల్లగుల్లాలు
లేఖ మీద ఉన్న ముద్రలను గుర్తించడం ద్వారా హత్య కేసును(Viveka murder) ఛేదించాలని సీబీఐ ప్రయత్నం చేస్తోంది. దస్తగిరి వాగ్మూలం ఇచ్చినప్పటికీ దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలేదు. పైగా రెండో వర్షన్ కూడా అతని వాగ్మూలం మీద నిందితులు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలను వింటోన్న కోర్టు రాతపూర్వక ఆధారాల కోసం చూస్తోంది. ఆ మేరకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన ఒకే ఒక ఆధారం వివేకా రాసిన లేఖ. ఆయన్ను హత్య చేసిన గొడ్డలి ఆచూకి ఇప్పటికీ లేకపోవడం ఈ కేసులోని హైలెట్ పాయింట్.
Also Read : Viveka Murder : గంగిరెడ్డి అరెస్ట్ కు CBI సిద్ధం! అనినాష్‌కి బేడీలు తప్పవ్ ?