వివేకా హత్య కేసు (Viveka Murder Case) విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..ఎక్కడంటే?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మార్చి 15, 2019న పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ కేసు విచారణను మొదట ఏపీ పోలీసులు చేపట్టారు. అనంతరం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కేసు విచారణలో జాప్యం జరుగుతుందని, దీనిపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కోరారు. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని కూడా ఆమె సుప్రీంకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. ఈ కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.