Site icon HashtagU Telugu

Viveka Murder : ఎంపీ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై నేడు హైకోర్టులో విచార‌ణ‌

Viveka

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కడ‌ప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి స‌హా నిందితుడిగా సీబీఐ చేర్చింది. ముంద‌స్తు బెయిల కోసం ఆయ‌న హైకోర్టుని ఆశ్ర‌యించారు. నిన్న ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి విచార‌ణ‌ను ఈ రోజుకి వాయిదా వేశారు. అయితే అవినాష్ రెడ్డిని ఈ రోజు సాయంత్ర 4 గంట‌ల త‌రువాత విచార‌ణ చేయాల‌ని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ఈ లోపు ఈ పిటిష‌న్‌పై తీర్పు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు అవినాష్ రెడ్డి పిటిష‌న్‌పై త‌న వాద‌న‌లు కూడా వినాల‌ని వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిష‌న్ వేశారు. ఆమె పిటిష‌న్‌ను కూడా హైకోర్టు ఈ రోజు విచార‌ణ చేయ‌నుంది.

వివేకా హ‌త్య కేసులో నిందితుడిగా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ రెడ్డి పాత్ర‌పై కూడా ద‌ర్యాప్తు చేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే అవినాష్ రెడ్డిని నిన్న సీబీఐ విచార‌ణ‌కు పిల‌వ‌గా.. ఆయ‌న హైకోర్టుని ఆశ్ర‌యించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా విచార‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సీబీఐ కేసు విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. ఈ రోజు సాయంత్ర నాలుగు గంట‌ల‌కు సీబీఐ విచార‌ణ‌కు ఎంపీ అవినాష్ రెడ్డి హాజ‌రుకానున్నారు.