Site icon HashtagU Telugu

Viveka murder case :అవినాష్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌ వాయిదా

Viveka Murder

Viveka

అంతా తూచ్,(Viveka murder case) సోమ‌వారం అవినాష్ రెడ్డిని(Avinash Reddy) సీబీఐ విచార‌ణ చేయ‌లేదు. ఆయన అరెస్ట్ ప్ర‌చారం గాలికి పోయింది. సీబీఐ ఆఫీస్ నుంచి అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు. ప్రెష్ గా మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు హాజ‌రు కావాల‌ని సీబీఐ నోటీసులు ఇచ్చిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, సోమ‌వారం సాయంత్రం సీబీఐ విచారిస్తుంద‌ని మ‌రికొన్ని వ‌ర్గాల్లోని ప్ర‌చారం. సీబీఐ వ‌ర్గాలు మాత్రం అవినాష్ రెడ్డి విచార‌ణ‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రోవైపు తెలంగాణ హైకోర్టులో వేసిన బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. ఆ సంద‌ర్బంగా వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిష‌న్ వేశారు. త‌న వాద‌న కూడా వినాలని ఆమె కోరారు. లంచ్ మోష‌న్ పిటిష‌న్ మీద విచార‌ణ జ‌రిగింది.విచార‌ణ‌ను రేప‌టికి వాయిదా వేసింది. మంగ‌ళ‌వారం ఉద‌యం విచార‌ణ చేప‌డ‌తామ‌ని హైకోర్టు చెప్పింది.

సీబీఐ ఆఫీస్ నుంచి అవినాష్ రెడ్డి (Viveka murder case)

(Viveka murder case) సీబీఐ దూకుడును గ‌మ‌నించిన మీడియా సోమ‌వారం అవినాష్ (Avinash Reddy) అరెస్ట్ ఉంటుంద‌ని భావించింది. పైగా అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేయ‌డానికి సీఆర్పీసీ 160 నోటీసును సీబీఐ ఇచ్చింద‌ని చెప్పారు. ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్ కూడా వేసుకున్నారు. ఇదంతా గ‌మించిన త‌రువాత అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ద‌మ‌యింద‌ని అంచ‌నాకు చాలా మంది వ‌చ్చారు. ఉద‌యం క‌డ‌ప నుంచి ప‌ది వాహ‌నాల్లో సీబీఐ విచార‌ణ‌కు అవినాష్ రెడ్డి బ‌య‌లుదేరారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విచార‌ణ షెడ్యూల్ ప్ర‌కారం హాజ‌రు కావాలి. ఆ లోపు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ ను చీప్ జస్టిస్ అనుతించారు.

షెడ్యూల్ ప్ర‌కారం 3 గంటల‌కు సీబీఐ ఆఫీస్ కు

విచార‌ణ‌లో పిటిష‌న్లో ఉండ‌గా సీబీఐ విచార‌ణ ఎలా చేస్తుంద‌ని అవినాష్ రెడ్డి(Avinash Reddy) త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. పిటిష‌న్ల‌పై విచార‌ణ పెండింగ్ లో ఉండ‌గా, ఆదివారం భాస్క‌ర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అందుకే, పిటిష‌న్ పై విచార‌ణ పూర్తయిన త‌రువాత అవినాష్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని ప్ర‌క‌టించారు. కానీ, పిటిష‌న్ పై విచార‌ణ మ‌ధ్యాహ్నం 3.14 గంట‌ల‌కు వాయిదా ప‌డింది. దీంతో అవినాష్‌రెడ్డి షెడ్యూల్ ప్ర‌కారం 3 గంటల‌కు సీబీఐ ఆఫీస్ కు వెళ్లారు.

Also Read : Viveka Murder case : వివేకా హ‌త్య క‌థకు నాలుగేళ్ల చ‌రిత్ర‌

తాడేప‌ల్లి కేంద్రంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని స‌న్నిహిత కోట‌రీతో ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు తెలంగాణ హైకోర్టు ఇంకో వైపు ఎన్ ఐఏ కోర్టులో కోడి క‌త్తి కేసు విచార‌ణల‌ను స‌మీక్షించార‌ని తెలిసింది. మ‌రింత లోతుగా వాద‌న‌ల‌ను వినిపించాల‌ని జ‌గ‌న్మోహన్ రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలప‌డంతో ఈనెల 20వ తేదీకి కేసును ఎన్ ఐఏ కోర్టు వాయిదా వేసింది. ఇక సీబీఐ ఆఫీస్ కు వెళ్లిన అవినాష్ రెడ్డి విచార‌ణ ఏమీలేకుండానే వెనుతిరిగారు. మంగ‌ళ‌వారం ఉద‌యం రావాల‌ని తాజాగా నోటీసులు సీబీఐ జారీ చేసింది. దీంతో తాడేప‌ల్లి కోట‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నం పొందింది. అయితే, బెయిల్ పిటిష‌న్ మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చే డైరెక్ష‌న్ మీద తాడేప‌ల్లి వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది.

 Also Read : Viveka: అవినాష్ ను కాపాడుతోన్న జ‌గ‌న్‌!అఫిడ‌విట్ లో సునీత‌!

అవినాష్ బెయిల్ పిటిష‌న్ ను వ్య‌తిరేకిస్తూ సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. ఒక వేళ విచార‌ణ‌కు హాజ‌ర‌యితే అరెస్ట్ చేస్తారా? అంటూ జ‌స్టిస్ సురేందర్ రెడ్డి అడిగారు. అవ‌స‌ర‌మైతే, అరెస్ట్ చేస్తామ‌ని చెప్పిన సీబీఐ న్యాయ‌వాది త‌న వాద‌న‌ల‌ను వినిపించారు.