Site icon HashtagU Telugu

Viveka Murder : గొడ్డ‌లి,లేఖపై ద‌ర్యాప్తు,అవినాష్ అరెస్ట్ కు CBI మ‌ల్ల‌గుల్లాలు

Viveka Murder

Viveka Murder

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో(Viveka Murder )  అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా? హ‌త్య చేసిన గొడ్డ‌లి, వివేకా రాసిన లేఖ దొరికిన‌ట్టేనా? వాటి మీద ఉన్న ఆధారాలు అవినాష్ రెడ్డి(Avinash Reddy) అండ్ టీమ్ ను హంత‌కులుగా చూప‌డానికి స‌రిపోతాయా? ఇలాంటి చ‌ర్చ ఇప్పుడు ఆస‌క్తిగా జ‌రుగుతోంది. వాస్త‌వంగా ఈ వారం కీల‌క స‌మాచారాన్ని సీబీఐ రాబ‌ట్టింది. హ‌త్య జ‌రిగిన రోజు మ‌ధ్యాహ్నం పులివెందుల చేరుకున్న డాక్ట‌ర్ సునీతా, ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డికి లేఖ‌ను వివేకా పీఏ కృష్ణా రెడ్డి అందించారు. ఆ విష‌యాన్ని సీబీఐ విచార‌ణ‌లో కృష్ణా రెడ్డి చెప్పిన వాగ్మూలం. దాన్ని స్థానిక పోలీసుల‌కు సునితారెడ్డి , రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆ రోజు సాయంత్రం అంద‌చేయ‌డం జ‌రిగింది. కానీ, ఆ లేఖ టాంపరింగ్ అంటూ అవినాష్ అండ్ టీమ్ చెబుతోంది.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్  (Viveka Murder ) 

హ‌త్య‌కు ఉప‌యోగించిన గొడ్డ‌లి ఎక్క‌డ నుంచి తెచ్చారు? ఆ గొడ్డ‌లి ఎక్క‌డ ఉంది? అనేది కూడా స్ప‌ష్టంగా తెలియ‌డంలేదు. దానిపై సీబీఐ ఇప్పుడు క‌న్నేసింది. హ‌త్య జ‌రిగిన రోజులు పోలీసులు సేక‌రించిన ఆధారాలు నిజ‌మైన‌వా? టాంపిరింగ్ చేసిన ఆధారాలు మాత్ర‌మే సీన్లో ల‌భించాయా? అనే కోణం నుంచి కూడా సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) చుట్టూ సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగుర్ని అరెస్ట్ చేసిన విచార‌ణ చేసిన త‌రువాత వాళ్లు ఇచ్చిన కొన్ని `క్లూ`ల ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్ లో కీల‌క సూత్ర‌ధారిగా సీబీఐ విశ్వ‌సిస్తోంది. ఆ మేర‌కు అఫిడ‌విట్ కూడా వేయ‌డం జ‌రిగింది.

ఎర్ర‌గంగిరెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఎందుకు డిఫాల్ట్ బెయిల్

ఏ1గా ఉన్న ఎర్ర‌గంగిరెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఎందుకు డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నారు? అనేది కూడా అంతుబ‌ట్ట‌ని విష‌యం. వాగ్మూలం ఇచ్చిన ద‌స్త‌గిరి బెయిల్ మీద ప్ర‌స్తుతం బ‌య‌ట ఉన్నారు. హ‌త్య‌కు(Viveka Murder) సూత్ర‌ధారి అవినాష్ రెడ్డి అంటూ సీబీఐ అఫిడ‌విట్ కూడా వేసింది. ఆయ‌న్ను అరెస్ట్ చేస్తేనే హ‌త్య కేసు కొలిక్కి వ‌స్తుంద‌ని కూడా కోర్టుకు చెప్పింది. హ‌త్య‌కు జ‌రిగిన ప్ర‌దేశంలో ఆధారాల‌ను ఎందుకు చెరిపేశారు? అనే ప్ర‌శ్న‌కు అవినాష్ రెడ్డి (Avinash Reddy) నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం రాలేద‌ని సీబీఐ మొత్తుకుంటోంది. బాడీకి కుట్లు ఎందుకు వేయించారు? గుండెపోటుగా ఎందుకు చిత్రీక‌రించారు? ఈ మూడు ప్ర‌శ్న‌ల‌కు అవినాష్ రెడ్డి ఖ‌చ్చిత‌మైన సమాధానాలు చెప్ప‌డంలేద‌ని సీబీఐ తొలి నుంచి చెబుతోంది. కానీ, ఆయ‌న్ను అరెస్ట్ చేసి విచార‌ణ చేసే స్వేచ్ఛ సీబీఐకి లేకుండా పోయింది. దానికి కార‌ణంగా ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు అంటూ స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

గంగిరెడ్డిని జైలుకు పంపేలా ( Viveka Murder)

సాధార‌ణంగా హ‌త్య(Viveka Murder) జ‌రిగిన త‌రువాత నిందితుడుకు బెయిల్ ఇవ్వ‌రు. కానీ, డిఫాల్ట్ బెయిల్ అంటూ ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ విచార‌ణ తొలి రోజుల్లోనే ఊర‌ట‌క‌లిగింది. సుప్రీం కోర్టు జోక్యంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ గంగిరెడ్డిని జైలుకు పంపేలా చేసింది. ఆయ‌న శుక్ర‌వారం రోజు సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయ‌న్ను పోలీసులు చంచ‌ల్ గూడ జైలు పంపారు. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు వివేకా హ‌త్య కేసులో గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిని సీబీఐ జైలుకు పంపింది. ఇక అప్రూవ‌ర్ గా మారిన‌ దస్తగిరి మాత్రమే బెయిల్ మీద బ‌య‌ట ఉన్నాడు.

Also Read : Viveka Murder : గంగిరెడ్డి అరెస్ట్ కు CBI సిద్ధం! అనినాష్‌కి బేడీలు త‌ప్ప‌వ్ ?

ఈ హ‌త్య (Viveka Murder)కేసును తొలుత ఏప్రిల్ 30వ తేదీలోపు విచార‌ణ ముగించేలా సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఆ త‌రువాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిష‌న్, దానిపై డాక్ట‌ర్ సునీత ఇంప్లీడ్ పిటిష‌న్ వేయ‌డం న‌డిచింది. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విష‌యంలో తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీం వ‌ర‌కు వాద‌న‌లు న‌డిచాయి. అవినాష్‌రెడ్డిని(Avinash Reddy) అరెస్ట్ చేస్తే మిన‌హా పూర్తి స‌మాచారం రాద‌ని సీబీఐ చెబుతోంది. ఆ క్ర‌మంలో జూన్ 30 వ‌ర‌కు విచార‌ణ ముగించే గ‌డువును సుప్రీం కోర్టు సీబీఐకి విధించింది. ఆ లోపుగా కేసును క్లోజ్ చేయాల‌ని దూకుడుగా వెళుతోన్న సీబీఐ అధికారుల‌కు ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల బ్రేక్ లు స‌మ‌స్య‌గా మారాయ‌ని రాజ‌కీయ స‌ర్కిల్స్ లోని టాక్. అయితే, సుప్రీం కోర్టు సీరియ‌స్ గా ఉండ‌డంతో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసే జూన్ 30 వరకూ ఎర్ర గంగిరెడ్డ బెయిల్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ గ‌డువు తరువాత గంగిరెడ్డి తిరిగి బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని వెసుల‌బాటు క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Avinash Reddy: అవినాష్ పై అనుమాలెన్నో..! సీబీఐ పిటిషన్‌ లో సంచలన మలుపు

ఇప్పుడు సీబీఐకి లేఖ‌, గొడ్డ‌లి ప్ర‌ధాన ఆధారాలుగా ఉన్నాయి. వాటి మీద ఉన్న ఫింగ‌ర్ ప్రింట్స్ ఆధారంగా విచార‌ణ కొన‌సాగిస్తోది. మ‌రో వైపు సీబీఐ వ‌ద్ద ఉన్న గొడ్డ‌లి, లేఖ అస‌లైన‌వి కాదంటూ మ‌రో వాద‌న కూడా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సీబీఐ విచార‌ణ వేగ‌వంతం ఎలా అవుతుంది? అవినాష్ రెడ్డిని(Avinash Reddy) ఎలా అరెస్ట్ చేస్తారు? అనేది సందిగ్ధం.