Viveka murder : అవినాష్ అరెస్ట్ కు`సుప్రీం` గ్రీన్ సిగ్న‌ల్‌

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి (Viveka murder) చుక్కెదురు అయింది. వెకేష‌న్ బెంచ్ ముంద‌స్తు బెయిల్ ను తిర‌స్క‌రించింది.

  • Written By:
  • Updated On - May 23, 2023 / 03:03 PM IST

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి (Viveka murder) చుక్కెదురు అయింది. వెకేష‌న్ బెంచ్ ముంద‌స్తు బెయిల్ ను తిర‌స్క‌రించింది. తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాల‌ని సూచించింది. ఈనెల 25న ముందస్తు బెయిల్(Anticipatory Bail) మీద విచార‌ణ సాగించాల‌ని హైకోర్టును ఆదేశించింది. అప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ లేకుండా చూడాల‌ని అవినాష్ రెడ్డి చేసిన అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది. పిటిష‌న్ పై వాద‌న‌లు జ‌రిగే స‌మ‌యంలో సీబీఐ త‌ర‌పున న్యాయ‌వాది డుమ్మా కొట్ట‌డం గ‌మ‌నార్హం.

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి  చుక్కెదురు (Viveka murder)

సుప్రీం కోర్టు ముంద‌స్తు బెయిల్ తిర‌స్క‌రించ‌డంతో ఇక అవినాష్ అరెస్ట్ (Viveka murder)ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. ఎందుకంటే, సీబీఐ నోటీసుల‌కు అనుగుణంగా హాజ‌రు కాక‌పోవ‌డాన్ని సుప్రీం కోర్టు అవినాష్ వాల‌కాన్ని త‌ప్పుబ‌ట్టింది. అంటే, ప‌రోక్షంగా అరెస్ట్ కు సానుకూల సంకేతాలు ఇచ్చిన‌ట్టు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సీబీఐ అధికారులు కూడా అవినాష్ ను అరెస్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. క‌ర్నూలు పోలీసులు స‌హ‌కారం అందిస్తే, సోమ‌వారం అరెస్ట్ ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, వైసీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున అవినాష్ త‌ల్లి ల‌క్ష్మీదేవి చికిత్స పొందుతోన్న ఆస్ప‌త్రికి త‌ర‌లివ‌చ్చారు. దీంతో లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని పోలీసులు సీబీఐకి తేల్చి చెప్పారు. దీంతో మంగ‌ళ‌వారం వ‌ర‌కు సీబీఐ అధికారులు(CBI) వేచిచూశారు. సుప్రీం కోర్టు కూడా ముంద‌స్తు బెయిల్ కు నిరాక‌రించ‌డంతో అరెస్ట్ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది.

అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండ‌ద‌ని భావించే వాళ్లు

ప్ర‌స్తుతం క‌ర్నూలులోని ఒక ప్రైవేటు ఆస్ప‌త్రి వ‌ద్ద అవినాష్ ఉన్నారు. ఆయ‌న త‌ల్లికి చికిత్స‌ను చేయిస్తున్నారు. భారీ పోలీస్ బందోబ‌స్తు మ‌ధ్య ఆస్ప‌త్రి ఉంది. పోలీసుల మోహ‌రింపు ఒక వైపు, వైసీపీ క్యాడ‌ర్ మ‌రో వైపు ఉన్నారు. దీంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఒక వేళ మంగ‌ళ‌వారం కూడా అరెస్ట్ చేయ‌క‌పోతే, ఈనెల 26వ తేదీ వ‌ర‌కు ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే, ఆ రోజున సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ పెద్ద‌లు కాపాడుతూ వ‌చ్చార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చెబుతూ వ‌చ్చాయి. అదే నిజ‌మైతే, ఈనెల 26వ తేదీ త‌రువాత మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులోని ప్ర‌ధాన సూత్ర‌ధారి అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండ‌ద‌ని భావించే వాళ్లు లేక‌పోలేదు.

అరెస్ట్ ఖాయ‌మంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం (Viveka murder)

ఇప్ప‌టి నాలుగుసార్లు సీబీఐ ఎదుట విచార‌ణ‌కు అవినాష్ రెడ్డి (Viveka murder)హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా అరెస్ట్ చేయ‌డ‌కుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన న్యాయ ర‌క్ష‌ణ ఉంది. దానిపై సుప్రీం కోర్టుకు సునితారెడ్డి వెళ్లారు. కేసు విచార‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు అరెస్ట్ వ‌ద్ద‌ని చెప్ప‌డం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించింది. ఫ‌లితంగా సుప్రీం కోర్టు సూచ‌న మేర‌కు హైకోర్టు ముంద‌స్తు బెయిల్ నిరాక‌రిస్తూ సీబీఐ త‌న‌ప‌ని తాను చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఆ రోజు ఇదిగో అరెస్ట్ అంటూ అవినాష్ రెడ్డి మీద న్యూస్ వ‌స్తూనే ఉంది. కానీ, సీబీఐ(CBI) నోటీసుల ప్ర‌కారం ఈనెల 19వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అత్య‌వ‌స‌ర ప‌నులు కార‌ణంగా హాజరుకాలేన‌ని లేఖ రాస్తూ పులివెందుల‌కు ఆరోజు వెళ్లారు. ఆ త‌రువాత సునీతారెడ్డి, రాజ‌శేఖ‌ర్ రెడ్డిని సీబీఐ మ‌రో కోణం నుంచి విచార‌ణ చేసింది. అద‌న‌పు స‌మాచారాన్ని సేక‌రించిన సీబీఐ ఈనెల 22న అవినాష్ రెడ్డి కి నోటీసులు ఇచ్చింది. ఆ రోజు అరెస్ట్ ఖాయ‌మంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

Also Read : YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో అనుచరులు

ఉత్కంఠ న‌డుమ ఈనెల 22న సీబీఐ కార్యాల‌యంకు అవినాష్ రెడ్డి(Avinash Reddy) వస్తున్నార‌ని అంద‌రూ ఎదురుచూశారు. కానీ, హైద‌రాబాద్ ను పులివెందుట‌కు ఆయ‌న వెళ్లారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న సీబీఐ అధికారులు వెంబ‌డించారు. ఆయ‌న త‌ల్లి ల‌క్ష్మీదేవికి బాగాలేద‌ని క‌ర్నూలు ఆస్ప‌త్రి వైపు ఆయ‌న కాన్వాయ్ మ‌ళ్లింది. సీబీఐ అధికారులు టీమ్ కూడా అటు వెళ్లింది. త‌న త‌ల్లికి సీరియ‌స్ గా ఉన్నందున విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని హైడ్రామాను న‌డిపారు. అదే మంగ‌ళ‌వారం వ‌ర‌కు కొన‌సాగింది. ఆ లోపుగా ముంద‌స్తు బెయిల్ కు సుప్రీం కోర్టు(Supreme court) వెకేష‌న్ బెంచ్ కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అక్క‌డ కూడా మంగ‌ళ‌వారం అవినాష్ రెడ్డికి చుక్కెదురు అయింది. ఇప్పుడు మ‌ళ్లీ తెలంగాణ హైకోర్టుకు ఇష్యూ వ‌చ్చింది. ఈనెల 25వ తేదీన వెకేష‌న్ బెంచ్ విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఆ లోపుగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి సీబీఐ ప్ర‌య‌త్నం చేయ‌నుంది. ఒక వేళ రాష్ట్ర పోలీసులు స‌హ‌కారం అందించ‌క‌పోతే, వాళ్ల మీద కూడా క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అధికారం సీబీఐకి ఉంది. ఇలా , ఏ కోణం నుంచి చూసినా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా క‌నిపిస్తోంది. అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకోక‌పోతే అరెస్ట్ త‌ప్ప‌దు.

Also Read : Viveka Murder Case: అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం? కర్నూల్ లో హైటెన్షన్