YS Sunitha couple who meet CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు. సీఐడీ చేత విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పారు. సునీత విన్నపం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలుసని చంద్రబాబు చెప్పారు. విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Rajnath Singh : కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు..రాజ్‌నాథ్ సింగ్
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డిని గత వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీనిపై ఈరోజు సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు.
కాగా, సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని గజ్జల తరఫున వాదించిన న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత కేసులోను అవే ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. దీనిపై రాంసింగ్ న్యాయవాది జూపూడి యజ్ఞదత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్రిమినల్ కేసులన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని, సీబీఐ అధికారులకు ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉందని గుర్తుచేశారు.