Viveka : జ‌గ‌న్ కోట ర‌హ‌స్యంలో వాళ్లిద్ద‌రూ! క్లైమాక్స్ కు వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌!

సీబీఐకి స్వ‌చ్ఛ వ‌చ్చిన‌ట్టేనా? అంటే వివేకానంద‌రెడ్డి(Viveka) హ‌త్య కేసు ద‌ర్యాప్తు వేగం చూస్తుంటే ఔనేమో!

  • Written By:
  • Updated On - February 3, 2023 / 05:12 PM IST

చ‌ట్టం త‌న‌పని తాను చేసుకుపోతుందా? సీబీఐకి స్వేచ్ఛ వ‌చ్చిన‌ట్టేనా? అంటే వివేకానంద‌రెడ్డి(Viveka) హ‌త్య కేసు ద‌ర్యాప్తు వేగం చూస్తుంటే ఔనేమో! అనే భావ‌న క‌లుగుతోంది. పైగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నుంచి గ‌త వారం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అపాయిట్మెంట్ ల‌భించ‌లేదు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ(CBI) విచారించిన క్ర‌మంలో అత్యంత విలువైన `క్లూ`ను సీబీఐ రాబ‌ట్టింది. జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి, భార‌తి దంప‌తుల‌కు న‌మ్మిన‌బంటుగా ఉండే న‌వీన్(ఇంటి చాక‌లిగా చెబుతుంటారు) కు కూడా తాఖీదులు అందాయి. అనుమానితులు మరికొంద‌రు ఈనెల 10వ తేదీన హాజ‌రు కాబోతున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే ఏదో జ‌రుగుతుంది? వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాబోతున్నాయ‌న్న ఆందోళ‌న తాడేప‌ల్లి వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తు వేగం(Viveka) 

గ‌త వారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ(CBI) అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం జ‌గ‌నోమోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లకు నోటీలు జారీ చేయడం తెలిసిందే. ఆ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ ఎదుట శుక్ర‌వారం హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు గత మూడు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో నవీన్ కూడా కడప చేరుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసిన అనంతరం నవీన్ ను విచారిస్తార‌ని తెలుస్తోంది.

Also Read : Viveka Murder : CBI విచార‌ణ‌కు AP CM జ‌గ‌న్ బ్ర‌ద‌ర్, తాడేప‌ల్లి కోట‌లో క‌ల్లోలం

వివేకా (Viveka) హత్య అనంతరం అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు అత్యధిక సంఖ్యలో కాల్స్ వెళ్లాయ‌ని సీబీఐ అధికారులు గుర్తించిన‌ట్టు స‌మాచారం. వాళ్లిద్ద‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబానికి అత్యంత స‌న్నిహితులు. అంతేకాదు, కృష్ణమోహన్ రెడ్డికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ కూడా  కృష్ణమోహన్ రెడ్డిని సీఎంవో లో కీల‌కంగా మార్చారు. తొలుత కృష్ణ మోహ‌న్ రెడ్డి స్వీక‌రించిన త‌రువాత మాత్ర‌మే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ కాల్ అయినా అడెంట్ అవుతారట‌. అంత‌టి సాన్నిహిత్యం, న‌మ్మ‌కం కృష్ణ‌మోహ‌న్ రెడ్డి మీద వైఎస్ కుటుంబానికి ఉంది.

తాడేప‌ల్లి సామ్రాజ్యంలోని వ్య‌క్తుల‌  విచార‌ణ‌

క‌డ‌ప కోర్టు నుంచి వివేకా హ‌త్య కేసు హైద‌రాబాద్ కు త‌ర‌లిన త‌రువాత సీబీఐ(CBI) దూకుడు పెంచింది. అంతే కాదు, యుద్ధప్రాతిప‌దిక‌న తాడేప‌ల్లి సామ్రాజ్యంలోని వ్య‌క్తుల‌ను విచార‌ణ‌కు పిలుస్తోంది. ఇప్ప‌టికే 500 మందికి పైగా అనుమానితుల‌ను విచారించారు. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను బ‌ట్టిన చందంగా ఎటూ తేల్చుకోలేక సీబీఐ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విచార‌ణ‌కు వెళ్లిన సీబీఐ అధికారుల మీద ఒకానొక సంద‌ర్భంలో కేసులు పెట్టే స్థాయికి ఏపీ పోలీస్ వెళ్లింది. ప్ర‌స్తుతం అక్క‌డ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఉంది. పైగా ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఉండ‌గా సీబీఐ విచార‌ణ కోరిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు దారితీసింది.

న‌వీన్, కృష్ణ‌మోహ‌న్ రెడ్డిల‌కు తాడేప‌ల్లి ర‌హ‌స్యం

మాజీ మంత్రి వివేకా(Viveka) కుమార్తె డాక్ట‌ర్ సునీత సుప్రీం కోర్టు మెట్లు తొక్క‌డంతో విచార‌ణ‌ను ఏపీ నుంచి తెలంగాణ‌కు మార్చారు. కానీ, తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాల‌ను వేర్వేరుగా చూడ‌లేని ప‌రిస్థితి రాజ‌కీయంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ సీబీఐ దూకుడుగా విచార‌ణ చేప‌డుతుండ‌డాన్ని గ‌మ‌నిస్తే వివేకా హ‌త్య కేసులోని నిజాల‌ను బ‌య‌ట‌పెడ‌తుంద‌న్న న‌మ్మ‌కం క‌లుగుతోంది. వాస్త‌వంగా న‌వీన్, కృష్ణ‌మోహ‌న్ రెడ్డిల‌కు తెలియ‌ని తాడేప‌ల్లి ర‌హ‌స్యం ఉండ‌దు. మూడు త‌రాలుగా న‌వీన్ కుటుంబం వైఎస్ ఫ్యామిలీలో భాగంగా ఉంటుంది. రాజారెడ్డి త‌రం నుంచి న‌వీన్ కుటుంబ స‌భ్యులు వాళ్ల‌తోనే ఉంటున్నారు. ఆ వార‌స‌త్వం కొన‌సాగుతూ ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్ లో న‌వీన్ (ఇంటి చాక‌లిగా కొంద‌రు చెబుతారు) కీల‌కంగా ఉంటున్నాడు.

 Also Read :Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

హ‌త్య జ‌రిగిన రోజు ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవ‌రితో మాట్లాడారు? ఏమి మాట్లాడారు? అనేది తేలితే, మిస్ట‌రీ వీడిన‌ట్టే. అంటే, దాదాపుగా వివేకా హ‌త్య కేసు విచార‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. కుటుంబంలోని హ‌త్య‌గా తొలి నుంచి అనుమానం ఉంది. ఆస్తుల కార‌ణంగా జ‌రిగిందా? రాజ‌కీయ వార‌స‌త్వం క్ర‌మంలో జ‌రిగిందా? అనేది తేలాల్సి ఉంది. బాబాయ్‌ హ‌త్య వెనుక సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రమేయం ఉంద‌ని టీడీపీ తొలి నుంచి ఆరోపిస్తోంది. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా వివేకా హ‌త్య చేయించిన సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఆరోప‌ణ‌ల‌ను సంధిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అవినాష్ రెడ్డి ఇచ్చిన బ‌ల‌మైన `క్లూ` మొత్తం వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్ట‌నుంది. ఈనెల 10వ తేదీన హ‌త్య కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారులుగా భావిస్తోన్న కొంద‌రు సీబీఐ(CBI) ఎదుట హాజ‌రు కానున్నారు. ఆ మేర‌కు సీబీఐ స‌మ‌న్లు ఇచ్చిన విష‌యం విదిత‌మే. మొత్తం మీద సీబీఐ ప్ర‌య‌త్నాలు, దూకుడును గ‌మ‌నిస్తే వివేకా హ‌త్య కేసులోని గుట్టుర‌ట్టు కానుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని అల‌జ‌డి.