Site icon HashtagU Telugu

Counter : మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కౌంటర్..

vishnuvardhan counter to gudivada amarnath

vishnuvardhan counter to gudivada amarnath

బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) గారు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే .. కుటుంబ, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని..మంత్రి గుడివాడ అమర్ నాధ్ (Gudivada Amarnath) ఫై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి (Vishnuvardhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై ఏ పార్టీ నేతలు విమర్శించినా..ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టిన , ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వాటికీ సమాధానం చెప్పకుండా విమర్శలు చేసిన వారిని వ్యక్తిగతంగా దూషించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. మా ప్రభుత్వం లో ఇది చేసాం..ఇన్ని ప్రాజెక్ట్ లు కట్టం..ప్రజలు కోసం ఇన్ని చేసాం..అన్ని చేసాం..రోడ్లు వేసాం అని ఏ నేత చెప్పారు. కేవలం సంక్షేమ పధకాల పేరుతో నెట్టుకొస్తూ ఉంటారు. పోనీ ఆ సంక్షేమ పధకాలు పూర్తిగా అందజేసారా అని అడిగితే సమాధానం చెప్పారు. కేవలం జగన్ భజన చేస్తూ ఉంటారు.

మొన్నటి వరకు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పకుండా ఆయన పెళ్లిళ్ల ఫై కామెంట్స్ చేస్తూ..వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు బిజెపి నేతలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని , కేంద్రం నిధులను వారి జేబుల్లో వేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదంటూ పురందేశ్వరి చేసిన కామెంట్స్ ఫై గుడివాడ అమర్ నాధ్ స్పందించారు.

చంద్రబాబు (Chandrababu) మాయల ఫకీరు వంటివాడని, ఆయన మాయలో పడి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా నష్టపోయారని ..పురందేశ్వరి గారూ… ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడుస్తామంటే మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి తండ్రి స్థాపించిన పార్టీని ఇప్పుడు మరిది నడుపుతున్నారు… వీళ్లేమో వేరే పార్టీని నడుపుతున్నారు’ అంటూ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మరిది స్క్రిప్టునే పురందేశ్వరి మాట్లాడుతున్నారని, ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరా? చంద్రబాబా? అనేది చెప్పాలన్నారు.

గుడివాడ అమర్ నాధ్ చేసిన వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ విమర్శలు చేసినప్పుడు వాటికి రాజకీయంగానే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర అధ్యక్షరాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే .. కుటుంబ, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం మీ పార్టీ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. అప్పులకు తగ్గ ఆస్తులను సృష్టిస్తున్నామని అమర్నాథ్ గారు చెప్పారు. మాటలు కాదు.. లెక్కలు చూపించి మాట్లాడాలి. మీ బడ్జెట్ లెక్కల్లోనే అసలు ఎలాంటి ఆస్తుల సృష్టి జరగడం లేదని మీరే చెబుతున్నారన్నారు. ఏపీ బీజేపీ (AP BJP).. మీ ప్రభుత్వ అప్పుల నిర్వాకాలన్నిటినీ లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచింది. ముందు వాటికి సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు.

అంతకరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చూసినా ఒక్క పరిశ్రమ కూడా కనిపించడం లేదన్నారు. అడ్డగోలుగా భూములు దోచి పెట్టిన ఒప్పందాలే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తరిమికొట్టిన భారీ పరిశ్రమలే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పెట్టుబడులు పెట్టారో మరి. అక్కడొస్తున్నాయి.. ఇక్కడొస్తున్నాయి అని పిట్టకథలు కాదు.. నాలుగున్నరేళ్లు అయింది.. ఎన్ని తెచ్చారో చూపించండి అని కౌంటర్ చేసారు.

Read Also : Demolish Osmania Hospital : ఉస్మానియా కూల్చివేత‌పై కేసీఆర్ స‌ర్కార్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం