ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) విశాఖపట్నంను భారతదేశ టెక్నాలజీ హబ్(Technology Hub)గా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, విశాఖకు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వస్తున్నాయని, ఇది నగర అభివృద్ధికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుందని అన్నారు. టెక్నాలజీ రంగంలో విశాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రయత్నాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు.
Kavitha : కవిత పార్టీ లో నువ్వు ఉంటే ఎంత? పోతే ఎంత? – సత్యవతి కీలక వ్యాఖ్యలు
లాజిస్టిక్స్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయని, సరుకుల రవాణా మరింత వేగవంతం అవుతుందని చెప్పారు. ఈ ప్రయత్నాల వల్ల రాష్ట్రంలో వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకొస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ పాలసీ పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు, లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయాలు విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని, ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్స్ హబ్‌గా కూడా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.