Hirakud Express Accident : విశాఖ – అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. ఏమైందంటే ?

Hirakud Express Accident :  హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్  విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్యరాకపోకలు సాగిస్తుంటుంది.

Published By: HashtagU Telugu Desk
Hirakud Express Accident

Hirakud Express Accident

Hirakud Express Accident :  హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్  విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్యరాకపోకలు సాగిస్తుంటుంది.  ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20807 నంబర్)  శనివారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్ వద్ద ప్రమాదానికి గురైంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ రైలు రాత్రి 12:41 గంటలకు విశాఖపట్నం నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరింది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, సంబాల్‌పూర్ జంక్షన్, బిలాస్‌పూర్ జంక్షన్ మీదుగా అనూప్‌పూర్ జంక్షన్‌కు సమీపించిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అనూప్‌పూర్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి పట్టాల మీదికి దూసుకొచ్చింది. లెవెల్ క్రాసింగ్ వద్ద మూసి ఉన్న రైల్వే గేటును దాటుకొని అతివేగంతో రైలును ఢీకొట్టి.. రైలు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. ఈ కారును హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్   కొన్ని మీటర్ల వరకు లాక్కు వెళ్లడంతో రైలులోని ఐదు బోగీలు దెబ్బతిన్నాయి.

Also Read :Bird Flu: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌రో వైర‌స్‌.. బర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలివే..!

ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం(Hirakud Express Accident) వల్ల ఆరు గంటలు ఆలస్యంగా రైలు గమ్యస్థానానికి చేరుకుంది. రాత్రి 11:25  గంటలకు అమృత్‌సర్‌కు చేరుకోవాల్సిన ఈ రైలు.. ఇవాళ తెల్లవారు జామున అక్కడికి చేరుకుంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ గాయపడ్డాడు.

స్పెషల్ ట్రైన్లకు ఏపీలోని స్టేషన్లలో హాల్టింగ్స్ సమాచారమిదీ..

రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. వీటిలో కొన్ని స్పెషల్ ట్రైన్లకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ స్పెషల్ ట్రైన్స్ ఏమిటి ? హాల్టింగ్ స్టేషన్స్ ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం.. చెన్నై- భువనేశ్వర్‌, ఎర్నాకుళం-బ్రహ్మపుర, చెన్నై ఎగ్మోర్‌-సంత్రాగచ్చి రూట్లలో మూడు ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనుంది. పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రైళ్లను నడిపించనున్నారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – భువనేశ్వర్‌ (06073) ప్రత్యేక రైలు మే 6, 13, 20, 27, జూన్‌ 3 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత రోజూ  ఉదయం 11.15 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు మే 7, 14, 21, 28, జూన్‌ 4 తేదీల్లో రాత్రి 9గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి తరువాత రోజు తెల్లవారుజామున 3.42 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది.ఎర్నాకుళం-బ్రహ్మపుర, చెన్నై ఎగ్మోర్‌-సంత్రాగచ్చి  రూట్లలోనూ దువ్వాడ మీదుగా అన్‌ రిజర్వుడ్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఎర్నాకుళం-బ్రహ్మపుర అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు (06087) ఏప్రిల్‌ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడకు వస్తుంది. అక్కడి నుంచి 11.07గంటలకు బయలుదేరి వెళుతుంది. బ్రహ్మపుర-ఎర్నాకుళం అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు (06088) ఏప్రిల్‌ 8, 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 12.40గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి సాయంత్రం 6.05గంటలకు దువ్వాడకు వస్తుంది. అక్కడి నుంచి 6.07 గంటలకు బయలు దేరుతుంది. ఎర్నాకుళం-బ్రహ్మపుర రూట్లో నడిచే అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు 22 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 సెకండ్‌ క్లాస్‌ లగేజీ/డిజేబుల్డ్‌ బోగీలతో ఉంటుంది.

  Last Updated: 07 Apr 2024, 08:16 AM IST