Visakhapatnam Port Record : విశాఖపట్నం పోర్టు మరో సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సరుకు రవాణా విభాగంలో తన రికార్డు తానే అధిగమించింది. ఈ వ్యవధిలో 73.73 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీంతో మన దేశంలోని ప్రధాన ఓడరేవులలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక కార్గో రవాణాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 2023 మధ్యకాలంలో వైజాగ్ పోర్టు మూడో ప్లేస్ లో నిలిచింది. కీలకమైన విషయం ఏమిటంటే.. స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వైజాగ్ పోర్టు బాగా వృద్ధిని సాధించింది.
Also read : Vinayaka Chaviti : ఏ వినాయకుడి ప్రతిమ ఎలాంటి శుభాలను కలిగిస్తుందంటే..
2030 నాటికి వైజాగ్ పోర్టు నుంచి 1 మిలియన్ కంటైనర్లను రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఈవివరాలను పోర్టు ఛైర్మన్ అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రూయిజ్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఇప్పటికే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు.