Sardapeetham : ‘పీఠం’పై విశాఖ రాజధాని ముహూర్తం!

ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి అనుకున్నది చేస్తాడు. అదే విషయాన్ని సన్నిహితులు చెబుతుంటారు.మూడు రాజధానులు విషయంలోనూ జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేసాడని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - February 7, 2022 / 09:31 AM IST

ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి అనుకున్నది చేస్తాడు. అదే విషయాన్ని సన్నిహితులు చెబుతుంటారు.మూడు రాజధానులు విషయంలోనూ జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేసాడని తెలుస్తోంది. అందుకే ఉద్యోగుల డిమాండ్ లను తీర్చడానికి ఒక మెట్టు దిగాడాని ఆ పార్టీ వర్గాల టాక్. విశాఖ తరలివెళ్లాడానికి అనువుగా సచివాలయ ఉద్యోగుల డిమాండ్ లను అన్నిటిని అంగీకరించాడని తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో ఉండే కేసులు కూడా ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చింది. దీంతో జగన్ టీం మూడు రాజధానుల అస్త్రాన్ని బడ్జెట్ సమావేశాల్లో తీస్తారని తాడేపల్లి వినికిడి. బడ్జెట్ సమావేశాల ను ఈ నెల 24 లేదా మార్చి 4వ తేదీన పెట్టాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ఆ సమావేశాల్లో కీలకమైన జిల్లాల పెంపు బిల్లు పెట్టబోతున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల బిల్లు పెడితే గందరగోళం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో వైపు మంత్రి వర్గ మార్పు కూడా అదే సమయంలో ఉంది. ఒక వైపు బడ్జెట్ కూర్పు ఇంకో వైపు జిల్లాల పెంపు ఇష్యూ, మూడు రాజదానుల బిల్లు, ఉద్యోగుల పీఆర్సీ ఇలా అనేక అంశాలతో రాష్ట్రం అట్టుడికే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి జగన్ అడుగు వేస్తున్నాడు.

ఉద్యోగుల విషయంలో జగన్ తలొంచాడు. ఒక మెట్టు దిగాడు. ఇక మూడు రాజదానుల విషయంలో కూడా ముందుకు వెళ్లకుండా చేయాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ఆ క్రమంలో పవన్ కూడా వేగం పెంచదానికి రెడి అయ్యాడు.ఈ నెల 9న జగన్ విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు వెళుతున్నాడు. శారదాపీఠంలో నిర్వహించే రుద్రయాగం, రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి శారదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇచ్చే సూచన మేరకు జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ మార్పు , విశాఖ నుంచి పరిపాలనకు ముహూర్తం పీఠం వేదికగా ఉంటుంది. గతంలో కూడా అక్కడి నుంచే ముహూర్తం పెట్టడం అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ స్వామి పెట్టే ముహూర్తం కు అనుగుణంగా మూడు రాజదానుల బిల్లు ఉండే అవకాశం ఉంది. ఒక వేళ ఏప్రిల్ 2న ఉగాదికి ముహూర్తం పెడితే ఈ 24న బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి అవకాశం ఉంది. కొంత ఆలస్యంగా ముహూర్తం ఉంటే మార్చ్4 న బడ్జెట్ సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తాన్నారని తెలుస్తోంది. ఆ సమావేశాల్లో ముందుగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన పూర్తి చెయాలి అని భావిస్తున్నారు. ఆ తరువాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా మూడు రాజధానులు బిల్లుకు ఆమోదం తెలపాలని ప్లాన్ జరుగుతుందని సమాచారం. ఏదైనా ఉగాది లోపు అంత క్లియర్ చేయాలని జగన్ అనుకుంటున్నఢని తెలుస్తోంది. అందుకోసం ముహూర్తం ఈ నెల 9న విశాఖ పీఠం పెట్టనుంది.

ఆ తరువాత మంత్రి వర్గ మార్పు ఉంటుందని వైసీపీ వర్గాల టాక్. ఇప్పుడున్న మంత్రివర్గం తోనే అన్ని కీలక బిల్లు లు ఆమోదం చేసి ఆ తరువాత మంత్రివర్గాన్ని 99 శాతం మార్చడానికి జగన్ పక్కా స్కెచ్ వేశాడని వినికిడి. ఒక వేళ మంత్రి వర్గాన్ని మార్చితే ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, స్పీకర్‌ తమ్మినేని, రోజా, పార్ధసారధి, జోగి రమేష్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇటీవల మంత్రి బాలినేని చెప్పినట్లుగా వందశాతం మార్పులుంటాయా..? లేక కొంతమందిని కొనసాగించి వారిస్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తారా..? అనేది సందిగ్ధం. ఇటీవల దాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గౌతమ్ రెడ్డితో పాటు ఒకరిద్దరి స్థానాలు సేఫ్ అని చాలా మంది భావించారు. ఇద్దరు ముగ్గురు మంత్రులపై ఇటీవల ఆరోపణలు, ఆడియో రికార్డ్స్ బయటకు రావడంతో వారికి ఊస్టింగ్ ఖాయమన్న ఊహాగానాలు లేకపోలేదు. ఇప్పటికే మంత్రుల పనితీరు, ఇతర వ్యవహారాలపై పీకే మార్క్ సర్వే నివేదికలు జగన్ వద్ద ఉన్నట్టు సమాచారం. వాటిపై తన ఆంతరంగికులతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది.

2019 లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి ఒకసారి మంత్రివర్గంలో మార్పులు చేశారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో వారి స్థానంలో చెల్లుబోయిన గోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజును మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాలినేని ఇటీవల చేసిన కామెంట్స్ ప్రకారం అయితే ఆ ఇద్దరి స్థానాలకు కూడా గ్యారెంటీ లేదన్న టాక్ వినిపిస్తోంది. విశ్వాసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 2 న ఉగాది సందర్బంగా విశాఖ నుంచి జగన్ పాలన ఉండబోతుంది. ఆ తరువాత మే నెలలో మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేయడానికి అవకాశం ఉంది. అందుకోసం అద్భుతమైన ముహుర్తాలను విశాఖ పీఠాధిపతి సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 9న జగన్ అక్కడికి వెళ్లనున్న క్రమంలో మూడు రాజధానులు, విశాఖ పాలన , మంత్రివర్గ మార్పు ముహూర్తం బయటకు రానుంది.