TDP NDA : ఎన్డీయేలో టీడీపీపై వాట్స‌ప్ యూనివ‌ర్సిటీలో వైర‌ల్ క‌థ‌నం

ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామ్యంపై ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అన్నింటి కంటే టీడీపీ సానుభూతిప‌రుల గ్రూప్ లో వైర‌ల్ అవుతోన్న ఒక ఆర్డిక‌ల్ ఆలోచింప చేస్తోంది. వాట్స‌ప్ యూనివ‌ర్సిటీలో తిరుగుతోన్న ఆ ఆర్డిక‌ల్ య‌థాత‌దంగా ఇలా ఉంది.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 01:23 PM IST

ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామ్యంపై ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అన్నింటి కంటే టీడీపీ సానుభూతిప‌రుల గ్రూప్ లో వైర‌ల్ అవుతోన్న ఒక ఆర్డిక‌ల్ ఆలోచింప చేస్తోంది. వాట్స‌ప్ యూనివ‌ర్సిటీలో తిరుగుతోన్న ఆ ఆర్డిక‌ల్ య‌థాత‌దంగా ఇలా ఉంది.

“తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటే కారణాలేంటి…??ఓట్ల కోసమా కాదు బిజెపికి ఈ రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంక్ లెస్ దేన్ 1%. పోనీ సీట్ల కోసమా కానే కాదు బిజెపికి ఓట్లే లేనప్పుడు సీట్లు రావు. పోనీ చంద్రబాబు గారి మీద ఉన్న కేసుల మాఫీ కోసమా…?? ఆయన మీద కేసులే లేవు, పోనీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరన్నా హత్య కేసుల్లో ఇరుక్కున్నారా…?? వారిని బయట వేయడం కోసం పొత్తుకు వెళ్తున్నాడా అంటే అది లేదు. పోనీ ఆయనకి వ్యక్తిగతంగా ఏమన్నా పదవుల కోసం వెళ్తున్నాడా…?? గతంలో దేశ స్థాయిలో వచ్చిన ఎన్నో అవకాశాలను రాష్ట్రం కోసం వదులుకున్నాడు కాబట్టి ఆయనకు ఆ అవసరం కూడా లేదు. పోనీ ఆయన కులం కోసం బిజెపితో పొత్తుకు వెళుతున్నాడా…?? కానే కాదు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కమ్మ సామాజిక వర్గం వలన తెలుగుదేశం పార్టీకి లాభం కానీ తెలుగుదేశం పార్టీ వలన కమ్మ సామాజిక వర్గం లాభం ఏమీ లేదు ఈ మాట కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఇదే వాస్తవం.
మరి ఓట్ల కోసం కాదు, సీట్ల కోసం కాదు, కేసుల రక్షణ కోసం కాదు, కుటుంబ సభ్యుల కోసం కాదు మరి దేని కోసం…?? ఇక్కడ పోలవరాన్ని ATM అన్నారు అదే నిజమైతే ఇప్పటివరకు బిజెపి వారు మౌనంగా ఉండేవారా…??
ఇదే పోలవరంలో అవినీతి జరగలేదని పార్లమెంట్ లో చెప్పింది, సుప్రీంకోర్టులో ఆఫిడవిట్ కూడా దాఖలు చేశారు.
2019 ఎన్నికలకు ముందు బిజెపి మాట్లాడింది వైసిపి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే అది మొత్తం అబద్ధం అని తెలియడానికి ఈ మూడు సంవత్సరాల మూడు నెలల కాలంలో జగన్ పరిపాలనే సాక్ష్యం. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు రుజువు చేయలేమని ఫిక్స్ చేసింది వైసిపి, బిజెపి లే
ఇన్ని నేపద్యాల నడుమ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బిజెపితో కలవాలను కుంటున్నారు…??
మరి ఆయన కులం కోసమా అంటే తెలుగు యువత BC కిచ్చాడు, తెలుగు మహిళ SC కిచ్చాడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి BC కిచ్చాడు.తెలంగాణా అధ్యక్ష పదవి SC కిచ్చాడు ఈ నాలుగు కీలక పదవుల్లో కమ్మోళ్ళు ఉన్నారా…?? లేరు కదా వీటన్నిటి నేపథ్యంలో మరి ఎందుకు బిజెపితో చంద్రబాబు కలవాలను కొంటున్నాడు అంటే
ఒక చారిత్రాత్మక సంక్షోభంలో ఎనిమిది సంవత్సరాల పసికూన ఆంధ్రప్రదేశ్ ఉంది. కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విధ్వసాన్ని ఆపడానికి అయ్యుండొచ్చు. ఎనిమిది సంవత్సరాల కొత్త రాష్ట్రానికి చంద్రబాబు వేసిన పునాదులు కాపాడడానికి అయ్యుండొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తుకు వెళ్లడం వలన ఎన్నికలు సజావుగా జరిగి, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను, విద్వాంసాన్ని ఆపడానికి అవకాశం ఉంటుందని కావొచ్చు .ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇన్ని విధ్వంశాలు, అరాచకాలు, అక్రమాల నడుమ కేంద్రంలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్లక తప్పని పరిస్థితి కాబట్టే చంద్రబాబు ఈ స్టాండ్ తీసుకొని ఉండవచ్చు. ఇక్కడ తగ్గిన వాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు చంద్రబాబు ఒక మెట్టు దిగినంత మాత్రాన వారి గౌరవానికి ప్రతిష్టకు వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలుగుదేశం బిజెపి కలిసి వెళ్లినంత మాత్రాన అది
రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే. #కొలికపూడి కామెంట్స్ నుండి సేక‌రించిన క‌థ‌నం“ అంటూ వాట్స్ ప్ యూనివ‌ర్సిటీల్లో వైర‌ల్ అవుతోంది.