Site icon HashtagU Telugu

AP Minister Peddireddy: టైగర్ ‘పెద్దిరెడ్డి’

Peddireddy

Peddireddy

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ జూలో మంత్రి పులుల ఫొటో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని పులి నమూనాను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఏపీలో పెద్ద పులుల గురించి మాట్లాడారు. ఇటీవల పులుల సంఖ్య పెరిగిందనే విషయాన్ని వెల్లడించారు. టైగర్ బొమ్మతో రామచంద్రారెడ్డి ఫొటో వైరల్ కావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ‘టైగర్ పెద్దిరెడ్డి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవిశాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీలో దాదాపుగా 75 పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన వివరించారు. శేషాచలం అటవిప్రాంతాన్ని కారిడార్‌గా చేసుకుని పులు సంచరిస్తున్నాయని, ఇవి పాపికొండల వైపు కూడా సంచరిస్తున్నాయని తెలిపారు.  2018లో ఉన్న పులుల సంఖ్య కంటే 60 శాతం పులులు పెరిగాయని వివరించారు. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌ నాగార్జనసాగర్‌ , శ్రీశైలం మధ్య ఉందని అన్నారు. పులుల సంఖ్య మరింత వృద్ధి చెందేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని అటవిశాఖ అధికారులకు సూచించారు.

Exit mobile version