Site icon HashtagU Telugu

Vinukonda MLA Bolla Brahmanaidu : టీడీపీ నేతలపై వినుకొండ ఎమ్మెల్యే అసభ్య దూషణలు..

Vinukonda Mla Bolla Brahman

Vinukonda Mla Bolla Brahman

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు , ప్రతివిమర్శలు, సవాళ్లు , సవాళ్ల నుండి అసభ్య దూషణల వరకు వెళ్తున్నారు. తాజాగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Vinukonda MLA Bolla Brahmanaidu ) చేసిన అసభ్య దూషణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీ.వీ.ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావులపై బొల్లా కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియా సమావేశం అని మర్చిపోయి పచ్చి బూతులు తిట్టారు. టీడీపీ వాళ్లు నోరు అదుపులో పెట్టు కోవాలని వార్నింగ్ ఇచ్చారు. నేనేంటో చూపిస్తా కొడకల్లారా అంటూ హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

బొల్లా బ్రహ్మ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇటు వైసీపీ నేతలు సైతం కాస్త ఆగ్రహమే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాస్త గట్టిగా మాట్లాడాలి కానీ..అసభ్య దూషణల వరకు వెళ్లకూడదని అంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో పార్టీ ఫై వ్యతిరేకత వుంది..కొంతమంది నేతలు మాట్లాడే తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు బొల్లా బ్రహ్మ నాయుడు తోటి పార్టీ నేతలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, ఎన్నికల తర్వాత మళ్లీ అంత ముఖం చూసుకునేవాళ్ళమే అని చెప్పుకొస్తున్నారు.

Read Also : Priyanka Gandhi : అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను విడుదల చేయండి