వారం రోజుల పాటు పల్లెల్లో ఎంతో ఆనందంగా గడిపిన పల్లెవాసులు..ఇక పట్నానికి పయనమయ్యారు. సంక్రాంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తమ సొంతర్లకు వెళ్లారు. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. నిత్యం రద్దీ తో ఉండే నగర రోడ్లన్నీ గత వారం రోజులుగా ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇక రేపటి నుండి మళ్లీ స్కూల్స్ , విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుండడం..సంక్రాంతి సెలవులు సైతం పూర్తి కావడం తో పల్లెకు వెళ్లిన ప్రజలంతా మళ్లీ నగరబాట పట్టారు. దీంతో బస్టాండ్స్ , రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.
ఇదిలా ఉంటే,.. దాదాపు బస్సులు, రైళ్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో తిరుగు ప్రయాణంలోనూ జనానికి అవస్థలు తప్పడం లేదు. ఇక రిటర్న్ జర్నీ సందర్భంగా ఏపీలో ఇప్పటికే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులతో కోలాహాలం నెలకొంది. సంక్రాంతి తిరుగు ప్రయాణంతో మళ్లీ రోడ్లన్నీ కిక్కిరిపోనున్నాయి. దీంతో హైవేలపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొననుంది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సిద్ధమయ్యారు.
Read Also : Vasupalli Ganeshkumar : విద్యాసంస్థలో మద్యం పంపిణి చేసిన వైసీపీ ఎమ్మెల్యే