Site icon HashtagU Telugu

Vijayawada : విజయవాడ వెస్ట్ బైపాస్ భూముల ధరలకు రెక్కలు..ఎందుకంటే !

Vijayawada West Bypass Land

Vijayawada West Bypass Land

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి(Amaravathi)ని తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో, విజయవాడ వెస్ట్ బైపాస్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ (Real Estate ) వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. గతంలో రాజధానిపై అనిశ్చితి కారణంగా పాయకపురం, జక్కంపూడి, పాతపాడు, గుణదల వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. అయితే అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బైపాస్ రోడ్ (Vijayawada West Bypass ) నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం విజయవాడ నుంచి అమరావతికి కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రధాన మార్గంగా మారనుంది.

Krishna Bhaskar : సీఎండి కృష్ణ భాస్కర్ కు భట్టి అభినందనలు

విజయవాడ వెస్ట్ బైపాస్ పరిసరాల్లో పదికి పైగా కొత్త వెంచర్లు ప్రారంభమయ్యే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చే యత్నం చేయడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ నత్తనడకన సాగింది. 2024లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, కొంతకాలం మార్కెట్ స్థిరంగా ఉండింది. కానీ ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్ట్ బైపాస్ ప్రాంతంలో భూముల కొనుగోలుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Minister Lokesh: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి లోకేష్

మొన్నటి వరకూ వెస్ట్ బైపాస్ పరిసర ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర రూ.14,000 నుండి రూ.16,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు భూసేవకుల ఆసక్తి పెరగడంతో చదరపు గజానికి రూ.30,000 వరకు పలుకుతోంది. భవిష్యత్తులో అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించినప్పుడు ఈ ధరలు మరింత పెరిగే అవకాశముంది. అపార్ట్‌మెంట్ల కంటే వ్యక్తిగత ఇండ్ల కోసం ప్లాట్ల కొనుగోలు పెరుగుతున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ క్రమంగా పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది.