Vijayawada:కేశినేని YCPలోకి?బెజ‌వాడ రాజ‌కీయ ర‌చ్చ‌

జ‌వాడ(Vijayawada) రాజ‌కీయం వేడిక్కింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ‌తార‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - June 1, 2023 / 03:09 PM IST

బెజ‌వాడ(Vijayawada) రాజ‌కీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ‌తార‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అందుకు బలం చేకూరేలా వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆహ్వానం ప‌లికారు. దానికి ఆజ్యం పోస్తూ పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ (పీవీపీ) ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌దునైన ప‌దాల‌తో కేశినేని మీద రాజ‌కీయ దాడిని ప్రారంభించారు. ఫ‌లితంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టం నెల‌కొంది.

ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ‌తార‌ని టాక్ (Vijayawada)

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి బెజ‌వాడ (Vijayawada)ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. ఆయ‌న త‌ర‌చూ ఏదో ఒక రీతిన అధిష్టానం మీద అస‌హ‌నం ప‌రోక్షంగా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. గ‌త మూడేళ్లుగా ఆయ‌న వాల‌కం అధిష్టానంకు మింగుడుప‌డ‌డంలేదు. ఢిల్లీకి ఇటీవ‌ల చంద్ర‌బాబు వెళ్లిన‌ప్పుడు బొకే ఇచ్చే విష‌యంలోనూ లొల్లి జ‌రిగింది. అధినేత చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మీద ప‌రోక్షంగా ఒకానొక సంద‌ర్భంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా దుమ్మెత్తిపోశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వ్య‌తిరేక గ్రూప్ గా ఉన్నారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ గ్రూపులు బ‌య‌ట‌ప‌డిన విష‌యం విదిత‌మే.

కేశినేని టీడీపీకి వ్య‌తిరేక వాయిస్

తాజాగా మైల‌వ‌రం, నందిగామకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న కేశినేని టీడీపీకి వ్య‌తిరేక వాయిస్ వినిపించారు. విజ‌య‌వాడ(Vijayawada) ఎంపీ టిక్కెట్ ఏ పిట్ట‌ల‌దొర‌కు ఇచ్చినా అభ్యంత‌రం లేద‌ని కామెంట్స్ చేయ‌డం వెనుక ఆయ‌న అస‌హ‌నాన్ని బ‌య‌ట‌పెట్టింది. అంతేకాదు, రాష్ట్రంలో చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చెందిన రెండే రాజ‌కీయ ఫ్లాట్ ఫారాలు ఉన్నాయ‌ని చెప్పారు. విజ‌య‌వాడ అభివృద్ధి కోసం ఎవ‌రితోనైనా క‌లుస్తానంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. విజ‌య‌వాడ నుంచి ఎవ‌రో పిట్ట‌ల దొర‌కు టీడీపీ టిక్కెట్ ఇస్తుంద‌న్న సంకేతం ఇచ్చారు. అందుకే, ప్ర‌త్యామ్నాయ వేదిక చూసుకుంటున్నాన‌ని ప‌రోక్ష సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

పీవీపీ ట్విట్ట‌ర్ వేదిక‌గా కేశినేని మీద  వార్

ఇక 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ (Vijayawada)నుంచి వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడూ ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ ప్ర‌క‌టించే ఆయ‌న ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నారు. ఒక వేళ వైసీపీలోకి కేశినేని వ‌స్తే, త‌న ప‌రిస్థితి ఏమిటి? అనే ఆందోళ‌న ఆయ‌న‌లో మొద‌ల‌యింది. అందుకే, కేశినేని మీద విరుచుకుప‌డుతూ ట్విట్ట‌ర్ వేదిక‌గా సీరియ‌స్ ట్వీట్ చేయ‌డం జ‌రిగింది. ఆర్థిక‌, రాజ‌కీయ, వ్య‌క్తిగ‌త అంశాల‌ను జోడిస్తూ కేశినేని(Kesineni) మీద పీవీపీ ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ ప్ర‌క‌టించారు. ఒక‌సారి ఆయ‌న వార్ ప్రారంభిస్తే, ఇక వ‌ద‌ల‌ర‌ని టాక్‌. అందుకే, ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా కేశినేని కేంద్రంగా విజ‌య‌వాడ రాజ‌కీయం ర‌చ్చ‌గా మారింది.

కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య కొన్ని వివాద‌స్ప‌ద అంశాలు (Vijayawada)

విజ‌య‌వాడ (Vijayawada) టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా కేశినేని చిన్నీ క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసుకుంటున్నారు. అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన సంకేతం మేర‌కు ఇటీవ‌ల జోరు పెంచారు. ప్ర‌స్తుతం ఎంపీ కేశినేని నాని సోద‌రుడు చిన్నీ. గ‌త రెండు ఎన్నిక‌ల్లో నాని గెలుపుకోసం ప‌నిచేసిన అనుభ‌వం చిన్నీకి ఉంది. అందుకే, టీడీపీ ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని భావిస్తోంది. పైగా ఆయ‌న లోకేష్ కోట‌రీలోని లీడ‌ర్ గా ఉన్నారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు క‌లిసొచ్చిన అంశాలు. అందుకే, ఇప్పుడు నానికి పోటీగా ధీటుగా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య కొన్ని వివాద‌స్ప‌ద అంశాలు కూడా న‌డిచాయి. ఎంపీ స్టిక్క‌ర్ తో ఉన్న వాహ‌నం హైద‌రాబాద్ లో తిరుగుతున్న విష‌యాన్ని కూడా నాని ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేయ‌డం జ‌రిగింది. అంటే, కొంత కాలంగా విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్ మీద రాద్దాంతం కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య న‌డుస్తోంది.

Also Read : TDP MP Kesineni Nani : ఏ పిట్ట‌ల దొర‌కి టికెట్ ఇచ్చినా అభ్యంత‌రం లేదు.. అవ‌స‌ర‌మైతే..?

తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ , కేశినేని నాని ప‌ర‌స్ప‌రం ప్ర‌శంసించుకుంటున్నారు. అంటే, వైసీపీలోకి నాని వెళ్లే ఛాన్స్ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీలోని లీడ‌ర్ గా ఉన్న ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అంటే, నానితో ఆయ‌నే లైజ‌నింగ్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తం మీద త్వ‌ర‌లోనే నాని టీడీపీకి గుడ్ బై చెబుతార‌ని బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పీవీపీ ప‌రిస్థితి ఏమిటి? అనేది భ‌విష్య‌త్ నిర్ణ‌యించాలి.

Also Read : CBN P4 Formula :విజ‌న్ 2047కు చంద్ర‌బాబు పీ4 ఫార్ములా