Site icon HashtagU Telugu

Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు

Sea Plane Services Krishna River Vijayawada To Srisailam Andhra Pradesh

Sea Plane Services : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం త్వరలో కొత్త రెక్కలు తొడగనుంది. కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు డిసెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి సర్వీసులను ప్రారంభించనున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలోని కృష్ణా జలాల్లో సీ ప్లేన్ సేవలను విజయవాడ వాసులకు అందుబాటులోకి  తెస్తారు.

Also Read :Wife Murders Husband : ఆస్తి కోసం భర్తను తెలంగాణలో చంపి.. కర్ణాటకలో తగలబెట్టిన భార్య

విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో, దుర్గమ్మ ఘాట్‌,  ప్రకాశం బ్యారేజీ వద్ద ఫ్లైఓవర్ దిగువన వాటర్‌డ్రోమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీ ప్లేన్‌ల సేఫ్ ల్యాండింగ్ కోసం సురక్షితమైన వాటర్ వేను అందుబాటులోకి తీసుకురానున్నారు. జెట్టీని సైతం నిర్మించనున్నారు. ప్రయాణికులు జెట్టీ ద్వారా బోటులోకి రాకపోకలు సాగించవచ్చు. వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో సీ ప్లేన్ రూట్ల సంఖ్యను పెంచనున్నారు. ఇతర రూట్లలో సీ ప్లేన్‌లను నడిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపైనా కేంద్ర ప్రభుత్వం సర్వే  చేయించనుంది.

Also Read :Palm Payment : అరచేతిని చూపిస్తే చాలు.. పేమెంట్ పూర్తవుతుంది.. చైనా తడాఖా

సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభమయ్యాక భక్తులు విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లొచ్చు. విజయవాడ నుంచి బయలుదేరే సీ ప్లేన్ నేరుగా శ్రీశైలంలో పాతాళగంగ వద్ద కృష్ణానదిలో ల్యాండ్ అవుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు సైతం ఈ సర్వీసులను విస్తరించే ఛాన్స్ ఉంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనకు 2014-2019 మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఆ ప్రాజెక్టును అమలు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. 

Also Read :AP High Court : ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం