విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని టీడీపీని(Vijayawada TDP) డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై దురుసుగా మాట్లాడారు. మహానాడుకు ఆహ్వానం ఇవ్వలేదని, ఆ గొట్టంగాళ్లు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత? అంటూ విరుచుకుపడ్డారు. ఇలా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ అధిష్టానంను సైతం ఇరకాటంలో పెడుతోన్న విజయవాడ ఎంపీ వాలకం అధిష్టానంకు తలనొప్పిగా మారింది.
100శాతం కాలినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు (Vijayawada TDP)
తాజాగా చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేశినేని కలిసే ఉన్నారు. ఒక వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు పార్టీలో కొనసాగుతూ గత మూడేళ్లుగా నెట్టుకొస్తున్నారు. ఒకానొక సందర్భంలో లోకేష్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. చెత్తగ్యాంగ్ ను పెంచి పోషిస్తున్నాడంటూ లోకేష్ మీద పరోక్షంగా రెండేళ్ల క్రితమే మండిపడ్డారు. ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని బలహీనతలను ఎత్తిచూపారు. ఆ సమయంలో టీడీపీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరిగింది. బీజేపీలో చేరతారని అనుకున్నారు. కానీ, పార్టీని వీడేదిలేంటూ విజయవాడ కార్పొరేషన్ (Vijayawada TDP) ఎన్నికల్లో కీలకంగా మెలిగారు. కుమార్తె శ్వేతను గెలుపించుకున్నారు. ఆమెను కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్టానం మీద అప్పట్లో ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ఆయన వ్యతిరేక గ్రూప్ గా ఉన్న బొండా ఉమ, బుద్దా వెంకన్న, దేవినేని తదితరులు అడ్డుకున్నారని భావించారు. అందుకే, అప్పట్లోనే వాళ్ల మీద కేశినేని తిరగబడ్డారు. ఆ సందర్భంగా విజయవాడ టీడీపీలోని విభేదాలు భగ్గుమన్నాయి.
వసంత కృష్ణప్రసాద్ తో కలిసి కేశినేని పలు కార్యక్రమాల్లో
నాలుగు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి కేశినేని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు, నందిగామ ఎమ్మెల్యేతోనూ కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని టీడీపీ (Vijayawada TDP) టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ ప్రకటించారు. ఇప్పటికే విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని బ్రదర్ చిన్ని చురుగ్గా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం సంకేతాలతో ఆయన దూసుకెళుతున్నారు. ఇదంతా లోకేష్ టీమ్(Lokesh team) చేస్తోన్న అనాలోచిత చర్యగా నాని భావిస్తున్నారు. అందుకే, వాళ్లను గొట్టంగాళ్లు అంటూ సంభోదిస్తూ రాసుకోవాలని మీడియాకు ప్రత్యేకంగా చెప్పారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ మండిపడ్డారు. ప్రస్తుతం 40 నుంచి 50శాతం మాత్రమే కాలుతోందని 100శాతం కాలినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేయడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : Palnadu Fight: పల్నాడు TDPలో `కన్నా`అలజడి! సత్తెనపల్లిపై`కోడెల`మార్క్!!
పొమ్మనలేక పొగబెట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని కేశినేని అనుమానించారు. ప్రత్యర్థి పార్టీలతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు వేయడం తప్పులేదన్నారు. మహానాడు అంశాన్ని ప్రస్తావించారు. ఆ వేదికపై ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతాడని చెప్పారని, అందుకే, రాలేదని చెప్పారు. ఇక చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ టూర్ సందర్భంగా పిఏ సమాచారం ఇవ్వగానే వెళ్లానని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా పార్టీలోని కొందరు పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహరిస్తున్నప్పటికీ వాళ్ల గెలుపు కోసం పనిచేస్తున్నానని అన్నారు. మరో వైపు ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన పీవీపీ రంగంలోకి దిగారు. ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ లో కేశినేని మీద యుద్ధానికి దిగారు. ఫలితంగా విజయవాడ రాజకీయం(Vijayawada TDP) రసవత్తరంగా మారింది.
Also Read : CBN P4 Formula :విజన్ 2047కు చంద్రబాబు పీ4 ఫార్ములా