CM Jagan Attack: జగన్ దాడి కేసులో నిందితుడికి నాన్ బెయిలబుల్… కేసు నమోదు

ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు.

CM Jagan Attack: ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు. ఒక రాయి సీఎం జగన్ కన్ను భాగాన తగలడంతో తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఎన్నికల సంఘం కూడా దాడిపై సంబంధిత అధికారుల్ని పూర్తి నివేదిక కోరింది. కాగా ఈ కేసులో మొదటిసారి కేసు నమోదైంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేశారు . హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి, అది నాన్ బెయిలబుల్ కేసుగా పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు ఆధారాలు సేకరించడంతో ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌లో భాగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనాస్థలంలోని ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను విచారణ కోసం నియమించారు.

We’re now on WhatsAppClick to Join

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ సింగ్‌నగర్‌లోని దాబా కోట్ల సెంటర్‌లో సీఎం జగన్‌ సభ వద్ద శనివారం రాత్రి 8:10 గంటలకు ఈ దాడి జరిగింది. సిఎం జగన్‌పై రాళ్లతో దాడి చేయడంతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు.

Also Read: BJP Manifesto 2024 : బీజేపీ మేనిఫెస్టోఫై సీఎం రేవంత్ కామెంట్స్