Site icon HashtagU Telugu

Vijayawada Metro : విజయవాడ మెట్రో పనులు వేగవంతం.. ప్రారంభ దశలో రెండు కారిడార్లకు ప్రణాళిక

Vijayawada Metro

Vijayawada Metro

Vijayawada Metro : విజయవాడ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ సాధికారత దిశగా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (APMRC) మొత్తం 91 ఎకరాల భూమిని గుర్తించి, తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషాకు తమ ప్రతిపాదనలు సమర్పించింది. మొదట్లో ఈ మెట్రో ప్రాజెక్ట్‌ను నాలుగు కారిడార్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించగా, ప్రస్తుతానికి రెండు కారిడార్ల నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వీటిలో ఒకటి గన్నవరం నుంచి, మరొకటి పెనమలూరు నుంచి ప్రారంభమవుతుంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) వద్ద ఈ రెండు మార్గాలు కలుస్తాయి.

మొదటి కారిడార్ – గన్నవరం వరకు (26 కి.మీ.).. ఈ మార్గం PNBS నుంచి మొదలై విజయవాడ రైల్వే స్టేషన్, ఎలూరు రోడ్డు, రామవరప్పాడు మీదుగా జాతీయ రహదారిని చేరుకుని గన్నవరం వరకూ విస్తరించనుంది.

Bus Accident: మురుగు లోయలో పడిన బస్సు.. 55 మంది మృతి

ముఖ్య స్టేషన్లు:

అక్కడి నుంచి మెట్రో ఎలూరు రోడ్డు వైపు మళ్ళి గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బెజెంట్ రోడ్ రైల్వే స్టేషన్ మార్గంలో తిరిగి PNBS చేరుతుంది. రెండో కారిడార్ – పెనమలూరు వరకు (12.5 కి.మీ.).. ఈ మార్గం PNBS నుంచి బందర్ రోడ్డును అనుసరించి బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కనూరు, పోరంకి వరకు విస్తరించనుంది.

ముఖ్యమైన స్టేషన్లు:

ఈ మెట్రో ప్రాజెక్ట్ విజయవాడ నగర రవాణా వ్యవస్థను సమూలంగా మారుస్తుందని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రధాన ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అధికారులు పేర్కొన్నారు.

HYD Tourist Place : హైదరాబాద్‌లో మరో టూరిస్టు ప్లేస్