Site icon HashtagU Telugu

Kanaka Durga Temple : విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..

Vijayawada Kanaka durga Temple Officials Meeting and take decisions for Temple Development and Devotees

Vijayawada Kanakadurga Temple

విజయవాడ(Vijayawada) కనకదుర్గ అమ్మవారి ఆలయంలో(Kanaka Durga Temple) గత కొంతకాలంగా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వెళ్లిన భక్తులు కొన్ని విషయాలలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు దుర్గగుడి పాలకమండలి సమావేశం నిర్వహించారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం జరగగా పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

దుర్గగుడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే..

*శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం

*శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహమండపం ఏర్పాటు

*వృద్ధులు,వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు

*ఏడాడి లోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం

*దూరప్రాంత భక్తుల కోసం మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం

*నామమాత్రపు రుసుముతో డార్మిటరీలో బసకు ఏర్పాట్లు

*కనకదుర్గ ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం

*బంగారు ఆభరణాల డోనర్స్ కు అందుబాటులో ఉండేలా మరో గోల్జ్ అప్రైజర్ ను నియమించాలని నిర్ణయం

*అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంటకు మ్యారేజ్ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయం

*అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం

*దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం

*అమ్మవారి సేవలను సోషల్ మీడియా,యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం చేయడం. దీనికోసం ఏపీ ఫైబర్ నెట్ కూడా అంగీకారం తెలిపింది.

*టిటిడి SVBC మాదిరిగా దుర్గగుడికి SDMBC ఛానల్ అందుబాటులోకి తీసుకురావడం

*అమ్మవారి కుంకుమ ప్రసాదం ప్రతీ భక్తుడికి ఇచ్చే కార్యక్రమాన్ని పౌర్ణమి రోజన ప్రారంభిస్తాం

*రెండు వేల మంది ఒకేసారి అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ ను విస్తరించడం

*అన్నదాన భవన్ కు రాబోయే నెల రోజుల్లోనే శంకుస్థాపన చేయడం.

 

Also Read : Kashi Yatra: ఐఆర్‌‌సీటీసీ కొత్త ప్యాకేజీ.. కాశీ యాత్ర సాగుతుందిలా!