Site icon HashtagU Telugu

Vijayawada Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్..

Vijayawada Kanaka Durga Temple Dasara Festival Schedule

Vijayawada Kanaka Durga Temple Dasara Festival Schedule

వచ్చే నెల అక్టోబర్(October) లో దసరా( రానుంది. దేశమంతా దసరా(Dasara) శరన్నవరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఇక అమ్మవారి ఆలయాలు ఉన్న ప్రతి చోట రోజుకొక అలంకారంతో పూజలు చేస్తారు. విజయవాడ ఇంద్రక్రీలాద్రి కనకదుర్గ అమ్మవారికి(Vijayawada Kanaka Durga Temple) దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి వేడుకల షెడ్యూల్ ని విడుదల చేశారు కనకదుర్గ అమ్మవారి ఆలయ అధికారులు.

ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. అక్టోబర్‌ 15వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 20న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం), 21న శ్రీ దుర్గా‌దేవి అలంకారం, 22న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవి అలంకారం, 23న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు కనపడనున్నారు. 23 సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.

సాధారణంగా పది రోజుల పాటు పది అలంకారంలలో దుర్గమ్మ భక్తులకు కనిపిస్తుంది. కానీ ఈసారి అధిక, నిజ శ్రావణ మాసం నేపధ్యంలో తిధులను అనుసరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లోనే దర్శనమివ్వనుంది దుర్గమ్మ. మొదటి రోజు ఎప్పుడూ ఉండే స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారం ఈసారి లేదు.

 

Also Read : Vishnu: విష్ణువుని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?