Vijayawada : సంఘీభావ ర్యాలీల‌కు అనుమ‌తులు లేవ‌న్న విజ‌య‌వాడ సీపీ.. అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌

కారులో సంఘీభావ యాత్రకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేవని సీపీ

Published By: HashtagU Telugu Desk
Vijayawada police

Vijayawada police

కారులో సంఘీభావ యాత్రకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేవని సీపీ క్రాంతిరాణాటాటా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో ది.24.09.2023వ తేదిన హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు హైదరాబాద్ ఐ.టి.ప్రోఫెషనల్స్ సంఘీభావ యాత్ర” కార్ ర్యాలీ ప్రోగ్రాం తలపెట్టినట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. ఈ విషయమై ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏవిధమైన వాహన ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదని సీపీ తెలిపారు. కావున నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ర్యాలీలను ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిర్వహించి నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తారో వారిపై ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ప్రకారం సెక్షన్ 143, 290,188, R/W 149,సెక్షన్ 32 పోలీసు యాక్ట్, పి.డి.పి.పి.చట్టం (Prevention of Damage to PublicProperty Act) సెక్షన్ 3 క్రింద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనముల యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ క్రాంతిరాణా టాటా తెలిపారు.

  Last Updated: 23 Sep 2023, 10:48 PM IST