Site icon HashtagU Telugu

Vijayawada : బెజవాడలో ఆ మూడు స్థానాల్లో నిలబడేది వాళ్ళే.. వైసీపీ క్యాండిడేట్స్ ని ప్రకటించిన సజ్జల..

Vijayawada contesting YCP MLAs in 2024 Sajjala Ramakrishna Reddy says

Vijayawada contesting YCP MLAs in 2024

విజయవాడ(Vijayawada) పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas) పుట్టిన రోజు వేడుకల్ని కార్యకర్తల మధ్య, పార్టీ నాయకుల మధ్య ఘనంగా విజయవాడలో నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) కూడా విచ్చేశారు. ఈ వేడుకల్లో విజయవాడలోని మూడు స్థానాల్లో వైసీపీ(YCP) నుంచి వచ్చే ఎన్నికల్లో(Elections) నిలబడేది ఎవరో చెప్పి వారినే గెలిపించాలని అన్నారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్(Devineni Avinash) ని, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు(Malladi Vishnu)లను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

విజయవాడ పశ్చిమ, సెంట్రల్ రెండు ప్రస్తుతం వైసీపీవే. వెల్లంపల్లి, మల్లాది విష్ణులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సజ్జల ప్రకటనతో మరోసారి 2024లో కూడా వాళ్ళే పోటీ చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇక విజయవాడ తూర్పు నుంచి ప్రస్తుతం టీడీపీ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బొప్పన భావ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ సారి దేవినేని అవినాష్ కి విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చినట్టు ఫిక్స్ అయింది. అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ నుంచి పోటీ చేయడం గమనార్హం.

 

Also Read : Thota Chandrasekhar: కాపుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న వైసీపీ సర్కార్