Site icon HashtagU Telugu

AP : టీడీపీ పార్టీకి నాలుగే గతి – విజయసాయి రెడ్డి

YCP MP Vijayasai Reddy

YCP MP Vijayasai Reddy

ఏపీ ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో తెలియంది కాదు..ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది..? ఎవరు ఎంత మెజార్టీ తో గెలుస్తారు…? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటూ ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం పెరగడంతో గెలుపు మాదంటే..మాదే అంటూ అధికార పార్టీ తో పాటు కూటమి పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఎవరెవరు ఎంత మెజార్టీ తో విజయం సాదించబోతున్నారో కూడా లెక్కలు వేసుకుంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు విజయసాయి రెడ్డి..టీడీపీ అధినేత చంద్రబాబు పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి చంద్రబాబుపై జాలి చూపారు. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు.. తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు 23 స్థానాలే దక్కాయని చెప్పారు. అప్పట్లో మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగిందనీ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని కొనుగోలు చేశాడని, జూన్‌ 4వ తేదీ నాడే కౌంటింగ్ జరగబోతోందని .. ఈ సారి ఎన్ని సీట్లకు చంద్రబాబు పరిమితం కాబోతున్నాడో ఈ పాటికి అర్థమై ఉంటుందని అన్నారు. ఈ లెక్కన టీడీపీ నాలుగు స్థానాలే దక్కబోతోన్నాయని, అందుకే చంద్రబాబు మీద జాలి వేస్తోందని చెప్పుకొచ్చారు. విజయసాయి కామెంట్స్ ఫై టీడీపీ శ్రేణులు తమదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు.

Read Also : AP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత