సమయం దొరికనప్పుడల్లా టీడీపీ అధినేతపై సెటైర్లు వేస్తుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు మరోసారి స్పందించారాయన. చంద్రబాబు భద్రతపై కేంద్రం ప్రత్యేక ద్రుష్టిసారించిన విషయం తెలిసిందే. ఈమధ్యకాలంలో చంద్రబాబు పర్యటనలో తరచుగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటుంది. కొన్నిరోజుల క్రితం కుప్పం పర్యటనలో పలు ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ జీ, డీఐజీ బాబుకు భద్రతను సమీక్షించారు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న బాబుకు 12 ప్లస్ 12 విధానంలో 24 మందితో హైసెక్యూరిటీని పెంచారు. దీనిపైన్నే స్పందించారు విజయసాయిరెడ్డి.
టీడీపీకున్న 23 మంది ఎమ్మెల్యేలకంటే…చంద్రబాబుకున్న సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబుకు కుప్పం ప్రజల నుంచే నిజమైన ముప్పు ఉందన్నారు. బాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ కుప్పం ప్రజలు ఆయనపై ఆగ్రహం తో ఉన్నారన్నారు.
