ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు – విజయసాయిరెడ్డి

2019 కంటే బలంగా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని , సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు

  • Written By:
  • Publish Date - November 3, 2023 / 03:26 PM IST

రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YCP Party) భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) ధీమా వ్యక్తం చేసారు. పల్నాడు (Vijayasai Reddy palnadu tour) పర్యటనలో విజయసాయి మాట్లాడుతూ.. మంచి చేసిన ప్రభుత్వ పని తనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు , నేతలకు సూచించారు.

అణగారిన వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకు రావాలనేదే జగన్ ప్రభుత్వ ప్రయత్నం.. అగ్ర కులాలలో పేదలకు కూడా ప్రభుత్వ సాయం అందుతుంది.. ప్రతి వర్గానికి మేలు చేయాలని ప్రభుత్వం పని చేసిందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

2019 కంటే బలంగా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని , సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు. 2019కు ముందు తలసరి ఆదాయం, ఇప్పటి తలసరి ఆదాయం పరిగణలోకి తీసుకోవాలన్నారు. వైసీపీ, సీఎం వైఎస్‌ జగన్ అధ్వర్యంలో విద్యా వైద్యానికి పెద్ద పీట వేశాం.. భవిష్యత్ లో పోర్టులు, నూతన రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. మరోసారి వైసీపీ గెలవాలి, సుభిక్ష పరిపాలన కొనసాగాలంటూ పిలుపునిచ్చారు.

అలాగే తెలంగాణ లో టీడీపీ (TDP) పోటీచేయకపోవడం ఫై స్పందించారు. తెలంగాణలో అసలు ఎక్కడా పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించుకోవడం 1982 తర్వాత ఇదే మొదటిసారి అని వెల్లడించారు. టీడీపీ పార్టీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. “నా అంచనా ప్రకారం 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుంది” అని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.

Read Also : TDP : తిరువూరు టీడీపీ సీటుపై క‌న్నేసిన వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి