VSR : నందమూరి కుటుంబంతో సరదాగా గడిపిన విజయసాయి రెడ్డి

VSR : రాజకీయ ప్రస్థానాన్ని ముగించి, వ్యవసాయ రంగంలో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, ఇటీవల నందమూరి కుటుంబ సభ్యులతో (Taraka Ratna family )సమయం గడిపారు

Published By: HashtagU Telugu Desk
Vijaya Sai Reddy Meet Nanda

Vijaya Sai Reddy Meet Nanda

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైఎస్సార్‌సీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. రాజకీయ ప్రస్థానాన్ని ముగించి, వ్యవసాయ రంగంలో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, ఇటీవల నందమూరి కుటుంబ సభ్యులతో (Taraka Ratna family )సమయం గడిపారు. ఈ విషయాన్ని నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య (Taraka Ratna Wife Alekhya) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

Health Tips : రాత్రిపూట వైఫై ఆఫ్ చేయకుండా నిద్రపోతున్నారా? ఈ సమస్యలు రావచ్చు.!

‘వీకెండ్ విత్ విఎస్ఆర్’ అంటూ అలేఖ్య విజయసాయిరెడ్డితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. విజయసాయిరెడ్డి, నందమూరి కుటుంబానికి బాబాయి వరుస కావడంతో అప్పుడప్పుడూ ఇలా కుటుంబ సభ్యలతో సరదాగా కలుస్తుంటారు. గతంలో తారకరత్న అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మరణించినప్పుడు, ఆయన కుటుంబానికి విజయసాయిరెడ్డి కుటుంబం అండగా నిలిచినా సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇటీవల విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిలను కలిశారన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ భేటీ మూడు రోజుల క్రితం జరిగిందని, దాదాపు మూడు గంటల పాటు చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఆయన షర్మిల నివాసంలో భోజనం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎవరు స్పందించలేదు. విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం, వైఎస్సార్‌సీపీకి కూడా గుడ్‌బై చెప్పారు. తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

  Last Updated: 03 Feb 2025, 07:16 AM IST