Site icon HashtagU Telugu

Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?

Vijayasai Reddy Bjp Ap Politics Ysrcp Tamilnadu

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అయినా తనదైన శైలిలో సైలెంటుగా రాజకీయాలను చక్కబెడుతున్నారు. రాజ్యసభ ఎంపీ పదవిని మధ్యలోనే వదిలేసిన విజయసాయి.. దాని కంటే కీలకమైన పోస్టుకే గురి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలోనే బీజేపీలోని కీలక నేతలతో టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌కు  స్వాగతం పలికిన వారిలో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) కూడా ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో జగదీప్ ధన్‌కర్‌‌తో ఆయనకు మంచి సంబంధాలే ఉండేవి. ఈక్రమంలోనే కలిసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో రాజకీయం ఏదీ లేదని కొందరు అంటున్నారు.

Also Read :PV Sunil Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌పై కేసు ?

‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ ఎందుకు ?

మరికొందరు మాత్రం ‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ గురించి ప్రస్తావిస్తున్నారు.  ఉప రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లిన వారిలో అనేక మంది విజయసాయికి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారట. ఇంతకీ ఎందుకు ? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.వ్యవసాయం చేసుకోవాలని విజయసాయి నిర్ణయించుకున్నందుకు ‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ చెప్పారా ? ఏదైనా కీలక పదవిని పొందబోతున్నందుకు ‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ చెప్పారా ? అనేది తెలియాలంటే మనం ఇంకొన్ని నెలలు వేచి చూడాలి. ఆలోగా అసలు నిజమేంటో మనందరి ముందుకు వస్తుంది.

Also Read :New MLCs : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల నేపథ్యం ఇదీ..

విజయసాయిరెడ్డిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తారనే  ప్రచారం జరుగుతోంది. పార్లమెంటులో హుందాగా వ్యవహరించడంలో,కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగడంలో విజయసాయి మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ ఆయన వ్యవహరించే శైలి పలువురు బీజేపీ పెద్దలకు బాగా నచ్చిందట. అందుకే విజయసాయిని గవర్నర్ చేయాలని డిసైడయ్యారని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి.బహుశా ఆ ఆఫర్ వచ్చాకే వైఎస్సార్ సీపీ నుంచి విజయసాయి తప్పుకొని ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పిన విజయసాయి.. ఇటీవలి కాలంలో ట్వీట్లను హిందీలో కూడా పెట్టడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి నేతలకు అర్థమయ్యేందుకే ఇలా చేస్తుండొచ్చని అనుకుంటున్నారు.