Vijayasai Reddy : నెల్లూరులో విజయసాయిరెడ్డికి చేదు అనుభవం..

. 'జనాలు వైసీపీ ముఖాన ఛీకొట్టి వెళ్లిపోతున్నారు. A2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు పట్టించుకోలేదు

Published By: HashtagU Telugu Desk
Vijayasai Nellur

Vijayasai Nellur

నెల్లూరు (Nellore) లో వైసీపీ ఎంపీ అభ్యర్థు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కి చేదు అనుభవం ఎదురైంది.. భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్లకండి అని ప్రచారం రథంపై మైకుల్లో వైసీపీ నేతలు మొత్తుకున్నా సభలో ఒక్కరు కూడా ఉండకుండా వెళ్తున్నారు.. దీంతో వైసీపీ సభల్లో ప్రజలు ఉండటం లేదని టీడీపీ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది.

గత ఎన్నికల్లో భారీ విజయం సాదించిన వైసీపీ..ఈసారి 175 కు 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 కు 25 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధినేత జగన్..సిద్ధం పేరుతో ప్రజల్లోకి వచ్చారు. గత రెండు రోజులుగా జగన్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరోపక్క వైసీపీ అభ్యర్థులు సైతం తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నెల్లూరు ఎంపీ బరిలో నిల్చున్న విజయసాయి రెడ్డి కి అడుగడుగునా ప్రజల నుండి నిరసనలు ఎదురవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న నెల్లూరు పార్లమెంట్ లో ప్రచారం చేస్తుండగా..ప్రజలు ఎవ్వరు లేకపోవడం..వచ్చిన కొద్దీ మంది కూడా కాసేపటికే వెనుతిరగడం తో వారిని ఆపేందుకు వైసీపీ నేతలకు దేవుడు కనిపించాడు. భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్లకండి అంటున్న సరే ఎవ్వరు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ ఘటన తో విజయసాయి రెడ్డి కి భారీ షాక్ తగిలినట్లు అయ్యింది. ఈ సందర్బంగా వైసీపీ సభల్లో ప్రజలు ఉండటం లేదని TDP సెటైర్ వేసింది. విజయసాయిరెడ్డి రోడ్ షోలో ప్రజల్ని వెళ్లొద్దు అంటూ వైసీపీ నేతలు కోరుతున్న వీడియోను షేర్ చేసింది. ‘జనాలు వైసీపీ ముఖాన ఛీకొట్టి వెళ్లిపోతున్నారు. A2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు పట్టించుకోలేదు. ఇక జగన్ సంగతి సరే సరి.. పులివెందులలోనే తుస్సుమంది. జగన్ నీ.. పని అయిపోయింది’ అంటూ ట్వీట్ చేసింది.

 

Read Also : Train Confirm Ticket: టికెట్ బుకింగ్‌పై బిగ్ అప్డేట్‌.. వేరొకరి టిక్కెట్‌పై ప్రయాణించడం సాధ్యమేనా..?

  Last Updated: 29 Mar 2024, 12:21 PM IST